ఇండస్ట్రీ టాక్ : పవన్ కళ్యాణ్ ప్లాన్ మార్చుకున్నాడా? లేటెస్ట్ అప్డేట్ ఏమిటంటే!

గాడ్ ఆఫ్ మాసెస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ఇపుడు తన సినిమాలతో పాటుగా రాజకీయాల్లో ఆక్టివ్ గా ఉన్న సంగతి తెలిసిందే. అయితే సినిమాల కన్నా గత కొన్ని నెలల నుంచి అయితే సినిమాల కన్నా రాజకీయాల్లో ఎక్కువ బిజీగా అయ్యాడు. దీనితో సినిమాల నిర్మాతలు దర్శకుల్లో అయోమయం నెలకొంది.

పైగా ఈ అక్టోబర్ 5 నుంచి భారీ పొలిటికల్ టూర్ కూడా స్టార్ట్ చేస్తున్నట్టు అనౌన్స్ చేయడంతో సినిమాల షూటింగ్ సంగతి అంతే అనుకున్నారు. కానీ లేటెస్ట్ గా ఈ టూర్ ని అయితే వాయిదా వేస్తున్నట్టు తాను అనౌన్స్ చేయడం హాట్ టాపిక్ గా మారింది. క్లారిటీ లేకుండా ఉండే పవన్ ఇప్పుడు కూడా అదే చేశారు.

ఆ టూర్ ఆపి ఇపుడు ఫైనల్ గా ప్లాన్ మార్చి సినిమాలపై దృష్టి పెట్టాలని చూస్తున్నారట. అయితే చిన్న చిన్న పొలిటికల్ మీటింగ్స్ తాను పాల్గొంటూ సినిమాల షూటింగ్ లు ఈ నెల నుంచే స్టార్ట్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. పైగా తన పొలిటికల్ టూర్ అయితే ఏకంగా వచ్చే ఏడాదిలో ఉంటుంది అని అంటున్నారు.

దీనితో అయితే అప్పటివరకు పవన్ నాన్ స్టాప్ షూటింగ్స్ లో పాల్గొంటాడని చెప్పాలి. ప్రస్తుతం అయితే పవన్ ఆల్రెడీ స్టార్ట్ చేసిన భారీ సినిమా “హరిహర వీరమల్లు” అలాగే మరో సినిమా వినోదయ సీతం చిత్రాలు షూటింగ్ చేయనున్నారు.