ఇలియానా అని ఆవేశపడితే దూల తీరిపోతుంది

ప్రస్తుత ఎంటర్నైన్మెంట్ ప్రపంచంలో సినిమా సెలబ్రెటీలదే హవా. దాంతో వారి పేరు చెప్పి మోసాలు చేసేవారు రోజు రోజుకీ పెరిగిపోతున్నారు. ఎందుకంటే సెలబ్రెటీ అనగానే మారు మాట లేకుండా బుట్టలోపడిపోతూంటాం. అదే సైబర్ నేరగాళ్లు కూడా చేసేది. హాట్ హీరోయిన్స్  పేరుతో లింక్ లు పంపి ..మనని ఎట్రాక్ట్ చేసి ఓపెన్ చెయ్యగానే మన సిస్టంలోకి వైరస్ ని పంపి మన దూల తీర్చే కార్యక్రమం పెట్టుకుంటారన్నమాట. ఆ లిస్ట్ లోకి మన గోవా బ్యూటీ ఇలియానా చేరింది. ఈ విషయాన్ని మెకాఫీ సంస్ద తమ ప్రకటనలో తెలియచేసింది.

రీసెంట్ గా ప్రముఖ  టెక్నాలజీ సంస్థ మెకాఫీ సంస్థ ఓ సర్వేను నిర్వహించింది. ఈ సర్వే ప్రకారం ఈ ఏడాది మోస్ట్ సెన్సేషనల్ సెలబ్రిటీ ఇలియానాని ఎంపిక చేసారారు.  కొంతకాలం పాటు సినిమాలకు దూరంగా ఉన్నా..కుర్రకారు గుండెల్లో,ఊహల్లో  మాత్రం ఈ బ్యూటీకి ఇంకా స్థానం పదిలంగానే ఉంది.

మెకాఫీ సంస్థ ఏ విధంగా సర్వే చేసిన విధానం ఏమిటీ అంటే.. మనకు ఇంటర్నెట్ ప్రపంచంలో  సెలబ్రిటీల పేర్లు, ఫొటోలతో కొన్ని లింక్స్ హాట్ హాట్ గా
కనిపిస్తుంటాయి.  ఈ లింక్స్ ను కనుక క్లిక్ చేస్తే హ్యాకర్స్ ని ఆహ్వానించినట్లే.  కొంతమంది హ్యాకర్లు ఈ సెలబ్రెటీలను అడ్డం పెట్టి యూత్ ని  బుట్టలో పడేసే పోగ్రాం పెట్టుకుంటున్నారు. అలా వాళ్లు మన పర్సనల్ డేటాను దొంగిలించేస్తారు. సాధారణంగా ఈ లింక్స్ ను ఎవరు క్లిక్ చేయరు అదే స్టార్
హీరోయిన్ల ఫోటోలను, వారి పేర్లను కనపడగానే టెమ్ట్ చేస్తారు.  అదీ విషయం.

ఇలియానా తరువాత  ప్లేస్ లో  ప్రియాంక చోప్రా, దీపికా, ప్రీతి జింటా, టబు, కృతి సనన్, అక్షయ్ కుమార్ తదితరులు ఉన్నారట.  కాబట్టి వీళ్ళ ఫొటోలతో కూడిన లింక్స్ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి.