శ్రీదేవి కూతురు ఖచ్చితంగా ప్రధాన మంత్రి అవుతా అంటుంది

‘ధఢఖ్’ మూవీ ప్రమోషన్లలో బిజీగా ఉన్నారు ఆ సినిమాలో హీరో హీరోయిన్లుగా నటించిన ఇషాన్ ఖట్టర్, శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్. అందులో భాగంగా ‘హార్పర్ బజార్’ అనే మాగజీన్ కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇంటర్వ్యూయర్ అడిగిన ఒక ప్రశ్నకు తడుముకోకుండా సమాధానం చెప్పింది జాన్వీ. మీ ఇద్దరిలో ఎవరు దేశప్రధాని అవ్వాలి అనుకుంటున్నారు అని అడగగా ఇషాన్ ఇద్దరం అవ్వలేమని చెప్పాడు.

జాన్వీ అతని మాటలు తీసి పడేస్తూ నేను అవుతాను అని చెప్పింది. ఇషాన్ నుండి మైక్ లాక్కుని మరీ నేను ప్రధాన మంత్రి అవుతాను అని చెప్పింది జాన్వీ. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. శశాంక్ ఖైతాన్ దర్శకత్వంలో వస్తున్న ఈ ‘ధఢఖ్’ మూవీ జులై 20 వ తేదీన విడుదలకు సిద్ధంగా ఉంది.