“హుషారు” సినిమాకు “ఏ” సర్టిఫికెట్

పాశ్చాత్య సినిమాల ప్రభావం తెలుగు సినిమాల మీద పడుతుంది అని ఎప్పటి నుంచో అంటున్నారు . “హుషారు ” సినిమా చూస్తే  ఈమాటలు  నిజమనిపిస్తాయి . లక్కీ మీడియా సంస్థ నిర్మించిన ఈ సినిమాకు ఈరోజు సెన్సార్ వారు “ఏ ” సర్టిఫికెట్ ఇచ్చారు .

శ్రీ హర్ష కొనుగంటి దర్శకత్వంలో బెక్కెమ్ వేణుగోపాల్ నిర్మించిన ఈ “హుషారు ” ఈ తరం యువతీ యువకులను దృష్టిలో పెట్టుకొని తీసినట్టు అనిపించింది . ఆర్య , బంటీ , చే , ధృవ్  అనే నలుగురు స్నేహితుల కథ ఇది . జీవితంలో స్నేహం విలువ ఎంత గొప్పదో చెప్పే ప్రయత్నం చేశారు .

అయితే ఈ నలుగురిలో ఆర్య , చే జీవితంలోకి వచ్చిన ఇద్దరమ్మాయిలు గీత, రియా ల మధ్య శృగారం మోతాదు మించిందనే ఉద్దేశ్యంతోనే  ఈ సినిమాకు “ఏ ” సరిఫికేట్ జారీ చేసినట్టు తెలిసింది . ఈ చిత్రం ద్వారా దర్శకుడుగా శ్రీ హర్షను వేణు గోపాల్ పరిచయం చేశారు .

ముఖ్య పాత్రల్లో తేజ్ కంచర్ల , తేజ్ కురపతి , అభినవ్ చుంచు , దక్ష నాగర్కర్ , అరియ వడ్లమాని , రాహుల్ రామకృష్ణ , ప్రమోదిని నటించారు . ఛాయాగ్రహణం ,రాజ్ తోట , సంగీతం రధం, కూర్పు , విజయ్ వర్ధన్ , కళ , మహేష్ .  సహా నిర్మాత లక్ష్మీనారాయణ , నిర్మాత బెక్కెమ్ వేణుగోపాల్ . రచన , దర్శకత్వం శ్రీ హర్ష కొనుగంటి .