కమ్మ, రెడ్డిపై ఆ ఆలోచనకు కారణం ఇదే
`కమ్మ రాజ్యంలో కడప రెడ్లు!` అంటూ కుల పిచ్చిపై సినిమా తీస్తున్న ఆర్జీవీ అలియాస్ రామ్ గోపాల్ వర్మను ప్రజలు దేవుడిలా చూస్తున్నారా అంటే.. 75 శాతం మంది ఆయనను దేవుడిగానూ కొలుస్తున్నారట. 25 శాతం మాత్రమే ఆయనని తిట్టుకుంటున్నారు. “నాకు కులపిచ్చి అంటూ ప్రచారం చేస్తున్నారు కొందరు! “ అంటూ తనని తూలనాడిన జొన్నవిత్తుల చౌదరి! (ప్చ్ పంచేశారుగా)పై సైలెంట్ గా ఏసేసారు వర్మగారు. నాకు కుల పిచ్చి లేదు. కుల పిచ్చి ఉండడం తప్పు కాదు! అని ఓ టీవీ చానెల్ ఇంటర్వ్యూలో అన్నారు. అంతేనా.. అసలు ఇలా కులాలపై సినిమా తీయాలన్న ఆలోచన ఎలా వచ్చింది? ఎందుకు వచ్చింది? అంటే అదిరిపోయే ఆన్సర్ చెప్పారు ఆర్జీవీ.
కువైట్ లోకి ఇరాక్ ఆర్మీ ప్రవేశించినట్టు..
ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైయస్ జగన్ ప్రమాణ స్వీకారం రోజు సడెన్ గా కడప అట్మాసియర్ విజయవాడలో వచ్చింది. ఎక్కడా సీబీఎన్ లేడు ఆరోజు.. పీకి పడేశారు. బెజవాడ నోవాటెల్ మొత్తం కడప రెడ్లు గుమిగూడారు. విజయవాడ మొత్తం జగన్ వర్గాలే కనిపించాయి. కువైట్ లోకి ఇరాక్ ఆర్మీ వచ్చి ఆక్రమించిన ఫీలింగ్ వచ్చింది. ఇంతకుముందు విభజన ముందు కాదు కానీ.. విభజన తర్వాత ఇలాంటి పరిస్థితి వచ్చింది కాబట్టి నాకు ఆ ఫీల్ వచ్చింది. దానినుంచి స్ఫూర్తి పొంది ఈ కథ రాసుకున్నాను అని తెలిపారు. నోవాటెల్ కిక్కిరిసిపోయి .. ఇన్విజన్‌గా కనిపించినప్పుడు కమ్మ రాజ్యంలో కడప రెడ్లు బ్యాక్ గ్రౌండ్ సౌండ్ వినిపించిందని అన్నారు. కమ్మల ఆధిపత్యం ఎక్కువగా ఉండే బెజవాడను రెడ్లు ఆక్రమించడమే తనకు స్ఫూర్తినిచ్చిందని తెలిపారు.
బెజవాడ కమ్మలంటే ఇష్టం
అక్కడ ఉన్న వాళ్లంతా కడప రెడ్లు అని ఎలా కనిపెట్టారు? అని ప్రశ్నిస్తే.. “కడప రెడ్లు అంటే వాళ్ల డ్రెస్సింగులు.. ఆ వెహికల్స్.. అన్నీ చూస్తుంటేనే తెలిసిపోతుంది. పరిటాల టైమ్ నుంచి చూస్తున్నాం. టోటల్ గా ఒక ఫ్యూడలిజం కనిపిస్తుంది. జగన్ ప్రమాణ స్వీకారం రోజున అవన్నీ చూశాను“ అని తెలిపారు. కమ్మవాళ్లను ఎలా డిఫైన్ చేస్తారు? అని ప్రశ్నిస్తే.. మహారాజాలు వాళ్లు. నాకు డైరెక్ట్ రాజసం అన్నది కమ్మ వాళ్లలో కనిపిస్తుంది. వీరమాచనేని చౌదరి ఈ టైపు పేర్లు నాకు బాగా నచ్చుతాయి. టైటిల్స్ లాగా ఉంటాయి వాళ్ల పేర్లు… అని ఆర్జీవీ సెటైర్ వేశారు. షూటింగ్ లొకేషన్స్ లో ఒళ్లంతా బంగారం పెట్టుకుని .. ఖరీదైన వాచ్ లు పెట్టుకుని కనిపిస్తారని కమ్మ సామ్రాజ్యంపై తన కుళ్లును బహిర్గతం చేశారు ఆర్జీవీ. నాకు విజయవాడ కమ్మాస్ అంటే చాలా ఇష్టం అని అభిమానం చూపించారు. ఇక కమ్మ రాజ్యంలో కడప రెడ్లు చిత్రంలో మొత్తం అన్నీ జీవించి ఉన్న పాత్రలే తెరపై కనిపిస్తాయని వెల్లడించారు. ఇంతకీ వర్మకు తన కులంపై ఉన్న పిచ్చి ఎలాంటిది అంటే.. అసలు పనికిమాలిన కులం ఏదైనా ఉందా? అంటే అది క్షత్రియ కులం అనేశారు. రాజా(కమ్మ)ల పక్కన వీళ్లు (క్షత్రియులు) ఉంటారు. అయ్యా బాబూ అని బతిమాలతారు! అంటూ తనదైన శైలిలో తిట్టేశారు ఆర్జీవీ.