ఇస్మార్ట్ శంకర్’లో హీరో క్యారెక్టర్ ఆదర్శంగా లేదని, దాన్ని వల్ల ప్రేక్షకులు తప్పుదారి పట్టే అవకాశం ఉందని కొందరు చిత్ర బృందాన్ని విమర్శించారు. ఈ మేరకు పలువురు సోషల్‌మీడియాలో కామెంట్లు పెట్టారు. వీటిపై రామ్ మంగళవారం స్పందించారు. ‘సీన్ చూడండి.. సీన్ చేయకండి’ అంటూ శంకర్ స్టైల్‌లో మాట్లాడారు.
హీరో హెల్మెట్ పెట్టుకోలేదు. హీరో పొగతాగుతున్నాడు. హీరో అమ్మాయిలకి గౌరవం ఇవ్వట్లేదు. ఎంతసేపు ఇవేకానీ. అక్కడ హీరో అడ్డం వచ్చినవాళ్లని చంపేస్తున్నాడు అని ఒక్కరూ ఫిర్యాదు చేయడం లేదు. జీవితానికి విలువ లేదు ! చాలా బాధాకరం. ‘ఇస్మార్ట్ శంకర్’ అనేదే ఓ చెడ్డ వ్యక్తి పాత్ర. ఇది సినిమా రా భాయ్. సీన్ చూడండి.. సీన్ చేయొద్దు’ అని పోస్ట్‌లు చేశారు. దీనికి పూరీ జగన్నాథ్ స్పందించారు.