పూరి తలుచుకుంటే స్టార్ హీరో సినిమాను కూడా రెండు మూడు నెలల్లో ఫినిష్ చేయగలడు. అయితే ఒకప్పుడు ఆయన పెన్ను గట్టిగానే పని చేసింది. కానీ ఇప్పుడు ఎంతో కొత్తగా ఆలోచిస్తే రాస్తే గాని జనాలు పట్టించుకోవడం లేదు. రెగ్యులర్ కమర్షియల్ ఫార్మాట్కు స్వస్తి చెప్పిన జనాలు మాస్ కమర్షియల్ సినిమాలు ఎంతో భిన్నంగా ఉంటే గానీ ఓకే చేయడం లేదు.
ఇక ఇప్పుడు పూరీ జగన్నాథ్ తనకు బౌన్స్ బ్యాక్ అయ్యేలా చేసిన ఇస్మార్ట్ శంకర్ లైన్ నే నమ్ముకున్నాడు. డబుల్ ఇస్మార్ట్ పేరుతో రాబోతున్న ఈ సీక్వెల్ తప్పకుండా మరోసారి బౌన్స్ బ్యాక్ అయ్యేలా చేస్తుంది అని నమ్ముతున్నాడు. లైగర్ సినిమాతో పూరి చాలా దారుణమైన డిజాస్టర్ చూశాడు. ఇప్పుడు దాన్ని ఢీకొట్టేలా డబుల్ ఇస్మార్ట్ ను తెరపైకి తీసుకురావాలి.
అయితే ఈ సినిమా కోసం పూరి కేవలం 8 నెలల టైం మాత్రమే తీసుకోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. పూరి కాస్త ఎక్కువ టైం తీసుకుని చేస్తేనే సినిమాలు బాగుంటాయి అని చాలామంది కోరుకున్నారు. ఇప్పుడు పర్ఫెక్ట్ స్క్రిప్ట్ తో సిద్ధమవుతున్నాడు కానీ ఎనిమిది నెలల్లో తొందరగా ఫినిష్ చేస్తే ఎలాంటి అవుట్ ఫుట్ వస్తుందో అనే సందేహాలు కూడా వస్తున్నాయి. ఇక ఈ ప్రాజెక్టు కోసం దాదాపు 40 కోట్ల రేంజ్ లో ఖర్చు చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. అది కూడా పాన్ ఇండియా అంటున్నారు. మరి ఈ ప్లాన్ ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి.