రామ్ ‘స్కంధ’కి అదొక్కటే పెద్ద డౌట్.!

‘స్కంధ’ ట్రైలర్‌ని మాస్ ఊర మాస్ తరహాలో తీర్చిదిద్దారు. ఈ తరహా జోనర్ రామ్‌కి బాగా వర్కవుట్ అవుతుంది కూడా. గతంలో ఇలా మాస్ జోనర్ ప్రమోషన్లు రామ్‌కి వర్కవుట్ అయిన సంగతి తెలిసిందే.

ఇక, ‘స్కంధ’ విషయానికి వస్తే, అది మాత్రమే కాకుండా గ్లామర్ డోస్ కూడా డబుల్ అనే చెప్పొచ్చు. ఓ వైపు శ్రీలీల, ఇంకో వైపు సాయి మంజ్రేకర్.. పోటా పోటీగా గ్లామర్ పండించేలా కనిపిస్తున్నారు.

అంతా పాజిటివిటీనే కనిపిస్తోంది. అయితే అసలు ట్విస్ట్ ఇక్కడే వుంది. ‘అఖండ’ సినిమా విషయంలో ఏదో మ్యాజిక్ జరిగింది. సూపర్ హిట్ అయిపోయింది. అదంతా బాలయ్య జిమ్మిక్ అనుకోండి.

అయితే, రామ్ చరణ్‌తో బోయపాటి సినిమా ‘వినయ విధేయ రామ’ ఫలితం గురించి తెలిసిందేగా. ప్రీ రిలీజ్ టైమ్‌లో వచ్చిన బజ్.. రిలీజ్ తర్వాత ఏం జరిగిందో.

అయినా అది పూర్తిగా చెత్త సినిమా. ‘స్కంధ’ కన్నా ఎక్కువ ప్రీ రిలీజ్ బజ్ దక్కించుకుంది. డైరెక్టర్‌పై నమ్మకంతో రామ్ చరణ్ ఈ సినిమాని చేసి వుండొచ్చు. కేవలం రామ్ చరణ్ సినిమా కాబట్టే.. డిజాస్టర్ టాక్ వచ్చినా 70 కోట్లు వసూళ్లు సాధించిందా సినిమా.

కానీ, రామ్ ‘స్కంధ’ విషయంలో అలా వుండదు. ఏమాత్రం తేడా కొట్టిందా అంతే సంగతి. ఈ సినిమాకి బడ్జెట్ కూడా ఎక్కువే ఖర్చు పెట్టించేశాడట బో్యపాటి శీను. ప్రీ రిలీజ్ బజ్ ఎలా వున్నా.. రిలీజ్ తర్వాత రిజల్ట్ తలచుకుని ఆందోళనలో డిస్ర్టిబ్యూటర్లు వున్నారని ఇన్‌డైడ్ టాక్.