వైరల్‌ గా మారిన క్యూట్‌ బ్యూటీ నభా ఫోటోలు!

‘నన్ను దోచుకుందువటే’ చిత్రంతో హీరోయిన్‌ గా పరిచయమయింది క్యూట్‌ బ్యూటీ నభా నటేష్‌. ఆతర్వాత కొన్ని సినిమాల్లో నటించినా అంతగా గుర్తింపు తెచ్చుకోలేకపోయింది. డైనమిక్‌ డైరెక్టర్‌ పూరిజగన్నాథ్‌ దర్శకత్వంలో వచ్చిన ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ తో సాలిడ్‌ హిట్‌ అందుకుంది. ఈ సినిమాలో తన నటనతో ఆకట్టుకుంది నభా.

‘ఇస్మార్ట్‌ శంకర్‌’ లో తెలంగాణ యాసలో మాట్లాడి కుర్రకారును కట్టిపడేసింది. అంతే కాదు గ్లామర్‌ తోనూ ఆకట్టుకుంది నభా నటేష్‌. ఆ తర్వాత ఈ ముద్దుగుమ్మకు వరుస ఆఫర్స్‌ క్యూ కట్టాయి. ఆ తర్వాత ఈ చిన్నదానికి అవకాశాలు కొంచెం తగ్గిపోయాయి.

ప్రస్తుతం సోషల్‌ మీడియా వేడిగా హాట్‌ హాట్‌ ఫొటోలతో దర్శక నిర్మాత కళ్లలో పడాలని ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా ఈ ముద్దుగుమ్మ షేర్‌ చేసిన ఫోటోలు నెట్టింట వైరల్‌ గా మారాయి.