కొద్ది రోజులుగా నిర్మాత బండ్ల గణేష్ .. దర్శకుడు హరీష్ శంకర్ మధ్య వివాదం గురించి తెలిసిందే. బ్లాక్ బస్టర్ నిర్మాత అని పొగడ్తల వర్షం కురిపించే హరీష్ ఏమైందో కానీ ఎనిమిది వసంతాల గబ్బర్ సింగ్ గురించి ప్రస్థావిస్తూ చిత్రయూనిట్ లో కీలకమైన వారి అందరి పేర్లు గుర్తు చేసి బండ్ల పేరు మరిచాడు. ఇంకేం ఉంది… దాంతో హర్ట్ అయిపోయిన బండ్ల గణేష్ ఇక ఎప్పటికీ హరీష్ శంకర్ తో సినిమా తీయనని చెప్పాడు.
“తింటున్నంత సేపూ ఇస్తరాకు అంటారు. తిన్నాక ఎంగిలి ఆకు అంటారు. నీతో అవసరం ఉన్నంత సేపు వరుసలు కలిపి మాట్లాడుతారు.. అవసరం తీరాక.. లేని మాటలు అంటకడుతారు“ అంటూ బండ్ల తీవ్ర ఆవేదనను వ్యక్తం చేశాడు. అయితే తొలుత పొరపాటు చేసి తర్వాత మరో ట్వీట్ లో కవర్ చేసేందుకు ఆన్సర్ ఇచ్చేందుకు ప్రయత్నించినా హరీష్ మాట బండ్ల అస్సలు వినలేదు. ఇక ఆ గొడవ అప్పటితో సద్దుమణిగిందిలే అనుకుంటుండగా.. ఇంతలోనే బండ్ల ఎనిమీ పీవీపీ లైన్ లోకొచ్చాడు.
ట్విట్టర్ లో పీవీపీ కాస్త ఘాటైన వ్యాఖ్యనే చేశాడు. “బండ్ల ఒక షార్ట్ ఫిల్మ్ కూడా చేయలేడు. కానీ చాలా మంది నిర్మాతలు హరీష్ కోసం ఎదురు చూస్తున్నార“ని అన్నారు. `డీజే` చిత్రంలో `కమ్మ` సమాజం గురించి హరీష్ శంకర్ రాసిన సంభాషణను కూడా గుర్తు చేయడం విశేషం. “పైనున్న అమ్మవారు కిందున్న కమ్మవారు“ అంటూ మా బెజవాడను బ్రహ్మాండంగా చెప్పావు అని హరీష్ ని పొగిడేయడమే గాక… బ్లేడ్ బాబు (బండ్ల) ఇకపై నీతో సినిమా తియ్యడట. వాడు యూట్యూబ్లో షార్ట్ ఫిల్మ్ కూడా తియ్యలేడు, నీకేమో నేనే కాక డజన్ల మంది నిర్మాతలున్నారు. మిరపకాయను మించి దువ్వాడను దాటించే సినిమా తియ్యడానికి“ అంటూ కాస్త ఘాటైన పదజాలమే వాడారు పీవీపీ. మొత్తానికి బండ్లపై దుమ్మెత్తిపోసేందుకు పీవీపీ కొంత టైమ్ తీసుకున్నాడన్నమాట. ఇంతకుముందు పీవీపీ – బండ్ల మధ్య సామాజిక బూతు పురాణం గురించి తెలిసిందే. ఆ ఇద్దరి మధ్యా పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది.