పవన్ నుంచి మరో రికార్డు బ్రేకింగ్ సినిమా అంటూ బండ్ల గణేష్ పోస్ట్ వైరల్.!

గాడ్ ఆఫ్ మాసెస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మళ్ళీ తన పంథా చూపిస్తున్నాడు. సినిమాలు లేదా రాజకీయాల్లో ఉంటే సూపర్ యాక్టీవ్ లేదా ఫుల్ డల్ అయ్యిపోతాడు. మరి ఇప్పుడు కూడా లాగే గత కొన్ని రోజులు కిందట నిర్విరామంగా రాజకీయ పనుల్లో బిజీ అయ్యిపోయి సినిమాలు కూడా పక్కన పెట్టేసాడు.

ఆరోగ్యం బాగోక తాను గ్యాప్ కొన్ని రోజు గ్యాప్ ఇచ్చాడు అనుకోవచ్చు. కానీ ఇప్పుడు తగ్గినా కూడా పవన్ బయటకి రావడం లేదు. దీనితో మళ్ళీ తన పంథా ఎవరికీ అర్ధం కావట్లేదు. ఇక అలాగే మరో పక్కా చాలా నెలల నుంచి హోల్డ్ లో ఉంచేసి సినిమాలు మళ్ళీ స్టార్ట్ చేస్తాడని బజ్ బయటకి రాగ..

పవన్ తో కొత్త సినిమాపై మాత్రం పవన్ మహా భక్తుడు టాలీవుడ్ ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ హింట్ ఇస్తున్నాడు. తాను కూడా చాలా రోజులు నుంచి తమ కాంబోలో సినిమాపై ఎలాంటి పోస్ట్ చేయలేదు. మరి లేటెస్ట్ గా అయితే పవన్ పై ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టడం వైరల్ గా మారింది.

నా దైవ సమానులు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మళ్ళీ తెలుగు చలన చిత్ర పరిశ్రమ దగ్గర రికార్డులు బద్దలు కొట్టే సినిమా చేయాలని కోరుకుంటున్నానని తాను తన గబ్బర్ సింగ్ సినిమాలో స్టిల్ తో పోస్టుకే చేసాడు. మరి మళ్ళీ ఇదంతా చూస్తుంటే పవన్ తో సినిమా కోసం ఏమన్నా దువ్వుతున్నాడేమో అనిపిస్తుంది. 
https://twitter.com/ganeshbandla/status/1555789142574845952