ఇపుడు టాలీవుడ్ సినిమా దగ్గర ఏ రేంజ్ లో రీ రిలీజ్ లు వస్తున్నాయో చూస్తున్నాము ఆ ఊ అంటే ఏదొక సినిమా ఇపుడు రీ రిలీజ్ అంటున్నారు. అయితే ఈ చిత్రాల్లో ఇపుడు తమిళ చిత్రాలు కూడా చేరడం ఒకెత్తు అయితే వాటిని మనవాళ్ళు నెత్తిన పెట్టుకోవడం ఇంకో ఎత్తు.
ఇక గత ఏడాది సూపర్ స్టార్ మహేష్ బాబు బర్త్ డే కానుకగా మొదలైన ఈ సినిమాల గోల ఇప్పుడు మళ్ళీ పవన్ కళ్యాణ్ బర్త్ డే వరకు వచ్చింది. కాగా గత ఏడాదిలో పవన్ బర్త్ డే కి గాను “జల్సా” చిత్రాన్ని ఫ్యాన్స్ వేసుకోగా ఈసారి “గుడుంబా శంకర్” రీ రిలీజ్ ని అయితే లాక్ చేశారు.
కాగా నిర్మాత నాగబాబు కూడా ఈ రిలీజ్ పై కన్ఫర్మ్ చేశారు. ఇక ఇదిలా ఉండగా ఈ సినిమా అనౌన్సమెంట్ తోనే ఈసారి పవన్ బర్త్ డే కి నా సినిమా కూడా రీరిలీజ్ చేస్తా అంటూ పవన్ భక్తుడు నిర్మాత బండ్ల గణేష్ కూడా ఓ అనౌన్సమెంట్ ఇవ్వగా ఫ్యాన్స్ లోనే చిర్రెత్తుకొచ్చింది.
ఎందుకు మధ్యలో ఇలా కెలుక్కోవడం అంటూ చాలా మంది అనుకున్నారు. అయితే గుడుంబా శంకర్ ని ఆగస్ట్ 31కి ప్లాన్ చేయగా తాను గబ్బర్ సింగ్ ని సెప్టెంబర్ 2 న పవన్ బర్త్ డే కానుకగా చేస్తారని తెలిపాడు. అయితే ఇప్పుడు ఫైనల్ గా ఈ చిత్రం రిలీజ్ పై తాను అప్డేట్ అందించాడు.
గుడుంబా శంకర్ రీ రిలీజ్ రేస్ నుంచి గబ్బర్ సింగ్ ని ఆపామని తర్వాత మరో డేట్ లో గబ్బర్ సింగ్ ని రిలీజ్ చేస్తామని అయితే క్లారిటీ ఇచ్చాడు. దీనితో ఇలా కన్ఫ్యూజన్ లేకుండా క్లారిటీ ఇచ్చినందుకు పవన్ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తూ గుడుంబా శంకర్ రీరిలీజ్ కోసం ఎదురు చూస్తున్నారు.
We will release our Blockbuster Gabbar Singh next one more blockbuster date Jai @PawanKalyan 🙏 https://t.co/VYEvEJrdVn
— BANDLA GANESH. (@ganeshbandla) August 18, 2023