ఇండస్ట్రీ టాక్ : “గాడ్ ఫాదర్” కి తెలుగు రాష్ట్రాల బిజినెస్ ఇంత జరిగిందా?

రేపు దసరా కానుకగా భారీ అంచనాలు నెలకొల్పుకుని రిలీజ్ కి సిద్ధంగా ఉన్న చిత్రాల్లో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన మరో చిత్రం “గాడ్ ఫాదర్” కూడా ఒకటి. దర్శకుడు మోహన్ రాజా తెరకెక్కించిన ఈ చిత్రం ఒరిజినల్ వెర్షన్ లూసిఫెర్ కన్నా మంచి స్క్రీన్ ప్లే తో తెరకెక్కినట్టుగా తెలిపారు.

అయితే ఈ భారీ సినిమా రిలీజ్ కి సిద్ధంగా ఉండగా సినిమా బిజినెస్ కి సంబంధించి ఇంట్రెస్టింగ్ అప్డేట్ అయితే వినిపిస్తుంది. ఈ చిత్రానికి ఒక్క తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ బిజినెస్ నే జరిపింది అట. తన లాస్ట్ సినిమా ఆచార్య 130 కోట్ల మేర బిజినెస్ చెయ్యగా..

ఈ చిత్రం అయితే 93 కోట్ల మేర ఒక్క తెలుగు భాష వరకు బిజినెస్ చేసినట్టుగా తెలుస్తుంది. ఆచార్య లాంటి సినిమా పడినా కూడా మళ్ళీ 90 కోట్ల బిజినెస్ అంటే అందులోని ఓ రీమేక్ కి కూడా అంటే ఇది తప్పకుండా మెగాస్టార్ క్రేజ్ అనే చెప్పాలి.

మరి ఇప్పటికే తెలుగులో అయితే భారీ బుకింగ్స్ కూడా కనిపిస్తున్నాయి. మరి అందుకున్నట్టే ఈ దసరా సీజన్లో మంచి రెస్పాన్స్ ని ఈ చిత్రం అందుకొని బాక్సాఫీస్ దగ్గర హిట్ అవుతుందో లేదో చూడాలి. ఇక ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ కూడా కీలక పాత్రలో నటించగా థమన్ సంగీతం అందించాడు.