మెగాస్టార్ “విశ్వంభర” పై మేకర్స్ బిగ్ అప్డేట్..!

టాలీవుడ్ మాస్ మూలవిరాట్ మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన రెండు సినిమాలు ఈ ఏడాది రిలీజ్ కి రాగ ఒకటి భారీ హిట్ అయితే ఒకటి భారీ డిజాస్టర్ అయ్యింది. కాగా ఈ చిత్రాలు తర్వాత మెగాస్టార్ తన కెరీర్ 156 మరియు 157 సినిమాలు కూడా అనౌన్స్ చేసేసారు అయితే కొన్ని పరిస్థితుల రీత్యా తన సినిమాలు లైన్ మారింది.

మరి ఈ చిత్రాల్లో 156వ సినిమాని యువ దర్శకుడు బింబిసార ఫేమ్ వసిష్ఠ మల్లిడి తెరకెక్కిస్తున్నాడు. మరి ఆల్రెడీ ఈ చిత్రానికి “విశ్వంభర” అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ కూడా ఫిక్స్ చేయగా ఈ సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుందా అని ఫ్యాన్స్ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుండగా మేకర్స్ అయితే నిన్న బిగ్ అప్డేట్ అందించారు.

మరి దీనితో ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయినట్టుగా తెలిపారు. ఒక ముఖ్యమైన షెడ్యూల్ తో అయితే తాము ఈ షూట్ స్టార్ట్ చేసినట్టుగా తెలిపారు. మరి ఇదొక బిగ్గెస్ట్ విజువల్ వండర్ కాగా యూవీ క్రియేషన్స్ వారు భారీ బడ్జెట్ తో ఈ సినిమాని నిర్మాణం వహిస్తున్నారు.

సినీ వర్గాల టాక్ ప్రకారం ఈ సినిమాకి ఏకంగా 200 కోట్లు పెడుతున్నట్టుగా తెలిసింది. దీనితో పాటుగా ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ లైన్ తో ఇది రాబోతుంది. ఇలా మొత్తంగా చాలా కాలం తర్వాత ఒక సెన్సేషనల్ అండ్ మెగాస్టార్ తన రేంజ్ మార్క్ సినిమాతో అయితే మళ్ళీ రాబోతున్నారు అని చెప్పాలి. ఇక ఈ సినిమాని ఆక్సార్ విజేత ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు.