వైరల్ : తన యంగ్ లుక్ తో కిక్ ఇస్తున్న చిరు..!

టాలీవుడ్ మాస్ మూల విరాట్ మెగాస్టార్ చిరంజీవి హీరోగా రీసెంట్ గా నటించిన చిత్రం భోళా శంకర్ తో చిరు తన కెరీర్ లో భారీ డిజాస్టర్ ని అందుకున్నారు. ఇక ఈ చిత్రం తర్వాత ఫ్యాన్స్ అంతా తన కెరీర్ 156 వ సినిమా కోసమే ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఈ భారీ చిత్రాన్ని బింబిసార దర్శకుడు వసిష్ఠ తెరకెక్కిస్తుండగా ఈ చిత్రాన్ని “విశ్వంభర” అనే టైటిల్ తో తెరకెక్కిస్తున్నారు.

ఐతే ఈ సినిమా వేరే లెవెల్లో ఉంటుంది అని ఇటీవల ఈ సినిమా సినిమాటోగ్రాఫర్ చోటా కె నాయుడు తెలిపాడు. మరి ఈ సినిమా నుంచి అసలు మెగాస్టార్ ఎలా ఉండబోతున్నారు అనేది ఇప్పుడు వైరల్ గా మారింది. ఆల్రెడీ ఓ షెడ్యూల్ సినిమాకి కంప్లీట్ అవ్వగా మెగా స్టార్ లుక్ అయితే అనధికారికంగా బయటకు వచ్చేసింది.

తన ట్విట్టర్ ఖాతాలో తన ఫోటోని చిరు సైలెంట్ గా అప్డేట్ చేయగా అందులో చాలా స్మార్ట్ గా కనిపిస్తున్న చిరు ని మనం చూడవచ్చు. దీనితో తన సరికొత్త లుక్ ఇప్పుడు రివీల్ అయ్యి సోషల్ మీడియాలో మెయిన్ గా మెగాస్టార్ ఫాన్స్ లో అయితే గట్టిగా వైరల్ గా అవుతుంది.

మెయిన్ గా పాత సినిమాల్లో అంటే ఒక 1990ల టైం లో ఉన్న చిరు గా తాను కనిపిస్తుండడంతో మెగా ఫ్యాన్స్ కి మరింత కిక్ వస్తుంది. మరి ఈ లుక్ కొత్తదేనా లేక ఎపుడైనా పాతది తాను పెట్టారా అనేది కొంచెం ఆగితే తెలుస్తుంది.