లేటెస్ట్ : ఫైనల్ గా వచ్చిన “గాడ్ ఫాదర్” ఫస్ట్ సాంగ్..కానీ మెగాస్టార్ ఫ్యాన్స్ నిరాశే!

ఇప్పుడు టాలీవువ్డ్ సినిమా దగ్గర బాగా వైరల్ గా మారిపోయిన లేటెస్ట్ భారీ సినిమా “గాడ్ ఫాదర్”. అప్పటివరకు సినిమాపై ఎలాంటిబజ్ లేదు సినిమా మేకర్స్ ఎందుకు ఇలా చేస్తున్నారు అనే సమయంలో మెగాస్టార్ చిరంజీవి నుంచి వచ్చిన ఓ షాకింగ్ ఆడియో క్లిప్ ఒక్క దెబ్బతో సినిమాని ఆడియెన్స్ లో ఎక్కడికో తీసుకెళ్ళిపోయింది.

దీనితో ఇక్కడ నుంచి గాడ్ ఫాదర్ చర్చ తెలుగు ఆడియెన్స్ లో స్టార్ట్ కాగా ఇదే టైం ని కాష్ చేసుకొని మేకర్స్ అభిమానులు ఎదురు చూస్తున్న మొదటి సాంగ్ ‘తార్ మార్ తక్కర మార్’ లిరికల్ వీడియో ని యూట్యూబ్ లో రిలీజ్ చేశారు. అయితే ఈ వీడియో తో సినిమా హైప్ ఒక్క ఇంచు కూడా తగ్గేలా లేదనిపిస్తుంది.

శ్రేయ ఘోషల్ వాయిస్ అలాగే థమన్ సంగీతం అనంత్ శ్రీరామ్ లిరిక్స్ తో టాలీవుడ్ బాలీవుడ్ ని ఈ సాంగ్ చుట్టేసినట్టుగా అదిరిపోయే లెవెల్లో ఉంది. సరే ఇదంతా బానే ఉంది కానీ ఈ సాంగ్ లో మాత్రం బాగా డిజప్పాయింట్ చేసే అంశం మాత్రం మెగాస్టార్ చిరంజీవే అని చెప్పాలి.

ఎందుకంటే ఇలాంటి బీట్ లో మెగాస్టార్ పై తన మార్క్ స్టెప్ ని ఒకటి కూడా సాంగ్ లో చూపించలేదు. జస్ట్ అలా తన గ్రేస్ లో చిన్న స్టెప్ చూపించినా ఈ సాంగ్ ఎంత బాగున్నా దానికి బిగ్ అడ్వాంటేజ్ అయ్యేది సాంగ్ అయితే బాగానే ఉంది కానీ మెగా ఫ్యాన్స్ మాత్రం ఎక్కడో నిరాశ పడక తప్పేలా లేదని చెప్పాలి.

ఇది తప్పితే ఈ సాంగ్ మ్యూజిక్ లవర్స్ కి బాగా నచ్చే అవకాశం ఉంది. మరి ఈ సాంగ్ లో అయితే సల్మాన్ ఖాన్ తో పాటు ప్రముఖ కొరియోగ్రాఫర్ ప్రభుదేవా కూడా కనిపించాడు. ఇక ఈ సినిమా అయితే ఈ అక్టోబర్ 5న దసరా కానుకగా రిలీజ్ కాబోతుంది. 
Thaar Maar Thakkar Maar - Lyric Video | God Father | Megastar Chiranjeevi | Salman Khan | Thaman S