(సూర్యం)
వరసపెట్టి బయోపిక్ లు తీసేస్తున్న సీజన్ ఇది. పాత తరం సినిమా వాళ్లు ఎవరు ఉన్నారు..వారి కథేంటి..బయోపిక్ కు పనికొస్తుందా..ఇది ఇప్పుడు తెలుగు సినీ పరిశ్రమ చేస్తున్న పెద్ద పని. అందులో భాగంగా ఆ మధ్యన ఒకరికి ఘంటసాల బయోపిక్ చేస్తే ఓ పనై పోతుందనే ఆలోచన పుట్టింది. ఆ వెంటనే ఘంటసాల ఫ్యామిలీని ఆ సినిమా చేద్దామనుకున్న వాళ్లు ఎప్రోచ్ అయితే ఇంట్రస్ట్ చూపెట్టలేదు.
సర్లే మనం సినిమా చేసేసి వాళ్ల ముందు పెడితే వాళ్లే ఓకే చేస్తారు అని ఆలోచన వచ్చింది. దాంతో దాదాపు ఎనభై శాతం షూటింగ్ పూర్తి చేసి..వాళ్లకు చూపించారట.అది చూసిన ఘంటసాల ఇంట్లో వాళ్లు కంగారుపడ్డారట. ఆ సినిమా కనుక బయిటకు వస్తే …ఘంటసాల ఇమేజ్ దెబ్బ తింటుందని, కథలో అసలు డ్రామా లేదని, సినిమా ఫ్లాఫ్ అవటం ఖాయమని వాళ్లకు నిర్దారణ అయ్యిందిట. దాంతో వాళ్లు ఆ సినిమా రిలీజ్ చేయద్దు అని చెప్పారట. మేము ఇంత ఖర్చు పెట్టాం..ఇంత శ్రమ పడ్డాం…ఇప్పుడు మీరు అర్దాంతరంగా ఆపేస్తే మా పరిస్దితి ఫిల్మ్ నగరే రోడ్లే అని చెప్పారట. అయినా సరే…సినిమా రిలీజ్ చేస్తే ఘంటసాల ఆత్మ క్షోబించటం తప్ప ఒరిగేది ఏమీ ఉండదు…కాబట్టి వద్దు అన్నారు. వాళ్లు వినలేదట. దాంతో ఇది కాదు పద్దతి అని కోర్టుకు వెళ్తున్నారని సమాచారం.
అందుతున్న సమాచారం మేరకు ఘంటసాల జీవితంపై రిసెర్చ్ చేసిన సిహెచ్ రామారావు ఈ బయోపిక్ కు దర్శకత్వ వహించనున్నాడు. యువ గాయకుడు కృష్ణ చైతన్య ఘంటసాల పాత్రలో నటించనున్నాడు..ఆయన భార్య…మృదుల ఘంటసాల సతీమణిగా కనిపించనుంది. లక్ష్మీ నీరజ ఈ చిత్రానికి నిర్మాత.. వాసురావు సంగీతం సమకూర్చనున్నాడు.
ఈ బయోపిక్ లోనూ ఎన్టీఆర్, ఏ ఎన్నార్ వంటి దిగ్గజాల పాత్రలు ఉంటాయి. ఆ రోజుల నాటి వాతావరణం ఉంటుంది. సినీ పరిశ్రమలోకి రాకముందు ఆయన క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని జైలుకు వెళ్ళటం వంటి అంశాలు ఉంటాయి. ముఖ్యంగా ఆయన జీవిత చరమాంకంలో పాడిన భగవద్గీత గురించి ఉంటుంది.
ఇది కూడా చదవండి
