ఇన్సైడ్ టాక్ : ఆ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన పవన్ కళ్యాణ్..?

గాడ్ ఆఫ్ మాసెస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ఇప్పుడు నటిస్తున్న సినిమాల పరిస్థితి కాస్త ఆశ్చర్యకరంగా మారింది అని చెప్పాలి. ఇప్పుడు సినిమాల కన్నా రాజకీయాల్లో ఎక్కువ దృష్టి పెడుతుండడంతో ఎక్కడికక్కడ తాను ఓకే చేసిన సినిమాలు ఆగిపోయాయి.

దీనితో కాస్త కన్ఫ్యూజన్ వాతావరణం నెలకొనగా మొన్న పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న అవైటెడ్ సినిమా “హరిహర వీరమల్లు” కొత్త గ్లింప్స్ తో అంతా మారింది. ఈ సినిమా షూటింగ్ తప్పనిసరిగా మళ్ళీ స్టార్ట్ కావాల్సి ఉండగా పవన్ కళ్యాణ్ అయితే ఫైనల్ గా ఈ సినిమాలో పాల్గొనేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా ఇన్సైడ్ టాక్.

అయితే పవన్ ఈ సినిమాని ఎప్పుడు నుంచి స్టార్ట్ చేస్తాడు అంటే ఈ సెప్టెంబర్ నుంచి కాదట వచ్చే నెల అక్టోబర్ 17 నుంచి తాను డేట్స్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. అయితే మరి పవన్ షెడ్యూల్ లో ఇదెలా సాధ్యం అవుతుందో కానీ ఇప్పుడు అయితే సినీ వర్గాల నుంచి ప్రస్తుతం ఉన్న సమాచారం ఇదే.

ఇక ఈ భారీ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా బాలీవుడ్ స్టార్ నటులు కూడా ఈ సినిమాలో కనిపించనున్నారు. అలాగే ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు.