HHVM Pre Release Event: సినీ నటుడు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమా జులై 24వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. అయితే తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుక హైదరాబాద్లోని శిల్పకళా వేదికలో ఎంతో ఘనంగా జరిగింది నిజానికి ఈ కార్యక్రమాన్ని ఒక బహిరంగ సభగా నిర్వహించి లక్షలాదిమంది సమక్షంలో చేసుకోవాలని పవన్ కళ్యాణ్ భావించారు కానీ వర్షాభావ కారణాలవల్ల కుదరలేదని తెలిపారు.
ఈ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ స్పీచ్ అదరగొట్టారని చెప్పాలి. ఇదిలా ఉండగా ఈ కార్యక్రమంలో భాగంగా పవన్ కళ్యాణ్ భార్య అన్నా లెజినోవా హాజరయ్యి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అయితే పవన్ కళ్యాణ్ ఇదివరకు ఎన్నో సినిమా వేడుకలకు వచ్చిన ఎప్పుడూ కూడా తన భార్యను ఇలా వెంట తీసుకురాలేదు కానీ మొదటిసారి తన భార్యతో కలిసి రావడంతో అందుకు గల కారణాలు ఏంటనే చర్చలు కూడా మొదలయ్యాయి. అయితే ఈ కార్యక్రమంలో భాగంగా ఎక్కువగా సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వారి కంటే కూడా రాజకీయ నాయకులే అధికంగా హాజరయ్యారు.
తెలంగాణ ఏపీ మంత్రులతో పాటు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు అలాగే కర్ణాటక ఫారెస్ట్ మినిస్టర్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇలా రాజకీయ నాయకులు ఈ కార్యక్రమానికి హాజరవుతున్న నేపథ్యంలో తన భార్యను కూడా తీసుకొస్తే మర్యాదపూర్వకంగా ఉంటుంది అన్న ఉద్దేశంతోనే పవన్ కళ్యాణ్ తన భార్యను ఈ కార్యక్రమానికి తీసుకువచ్చారని తెలుస్తుంది. ఇక పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఎక్కువగా రాజకీయ కార్యకలాపాలకు సంబంధించిన విషయాలలో తన భార్యను కూడా భాగం చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఈ కార్యక్రమానికి హాజరైన అన్నా ఎరుపు రంగు చుడీదార్ లో ఎంతో చూడముచ్చటగా కనిపించారు.
