ఇండస్ట్రీ టాక్ : పవర్ స్టార్ “హరిహర వీరమల్లు” పై మొత్తానికి గుడ్ న్యూస్… 

harihara veeramallu

గాడ్ ఆఫ్ మాసెస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ఇపుడు పలు సినిమాలు అలాగే రాజకీయాల్లో కూడా బిజీగా ఉన్న సంగతి అందరికి తెలిసిందే. అయితే ఈ మధ్యలో కాస్త ఆరోగ్యం బాగోకపోవడం మూలాన గ్యాప్ ఇచ్చి మళ్ళీ పొలిటికల్ పనుల్లో యాక్టీవ్ అయ్యాడు.

కానీ సినిమాలు మాత్రం అలా అగమ్యగోచరంగానే మిగిలిపోయాయి. ముఖ్యంగా దర్శకుడు క్రిష్ తో చేస్తున్న భారీ బడ్జెట్ పాన్ ఇండియా సినిమా “హరి హర వీరమల్లు” పరిస్థితి అంతకంతకు ఆందోళనగా మారుతుంది. ఇప్పటికే పవన్ ని నమ్మి ఎన్నో కోట్లు ఖర్చు పెట్టేసారు.

కానీ పవన్ ఏమో ఇప్పుడు బాగా గ్యాప్ ఇచ్చేస్తున్నాడు. కానీ ఎట్టకేళల్కి అయితే ఫైనల్ గా ఓ గుడ్ న్యూస్ రాబోతున్నట్టుగా ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల నుంచి కొత్త టాక్ ఒకటి వినిపిస్తుంది. అన్నీ సెట్టయితే పవన్ ఈ సినిమా షూటింగ్ ని ఈ వచ్చే నెల సెప్టెంబర్ నుంచే స్టార్ట్ చేయనున్నట్టుగా తెలుస్తుంది.

దీనితో అయితే పవన్ ఫ్యాన్స్ కి ఒక గుడ్ న్యూస్ వచ్చినట్టే అని చెప్పాలి. మరి ఈ సినిమాలో హాట్ బ్యూటీ నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. అలాగే ఈ చిత్రం సుమారు 150 కోట్ల బడ్జెట్ తో మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై తెరకెక్కుతుంది.