Nidhi Agerwal: తెలుగు ప్రేక్షకులకు ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇస్మార్ట్ శంకర్ సినిమాతో సూపర్ క్రేజ్ ని తెచ్చుకుంది ఈ ముద్దుగుమ్మ. ఈ సినిమాతో భారీగా గుర్తింపును కూడా సంపాదించుకుంది. అంతేకాకుండా ఈ సినిమా తర్వాత ఈమెకు తెలుగులో వరుసగా అవకాశాలు వస్తాయని తెలుగులో సినిమాలు చేస్తుందని అందరూ భావించారు. కానీ ఊహించని విధంగా కోలీవుడ్ కి షిఫ్ట్ అయ్యి అందరికి షాక్ ఇచ్చింది. గల్లా అశోక్ తో హీరో సినిమా చేసిన నిధి ఆ తర్వాత తెలుగులో సినిమాలు చేయలేదు. ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో హరిహర వీరమల్లు సినిమా చేసింది.
ఈ మూవీ త్వరలో విడుదల కాబోతుంది. ఈ సినిమాతో పాటు డార్లింగ్ ప్రభాస్ తో రాజా సాబ్ సినిమాలో కూడా నిధి నటిస్తోంది. అయితే తెలుగులో ఈమె కెరియర్ దాదాపు అయిపోయింది అనుకుంటున్నా సమయంలో ఒకేసారి రెండు పాన్ ఇండియా సినిమాలతో రాబోతోంది ఈ ముద్దుగుమ్మ. ఈ రెండు సినిమాలు కూడా ఈ ఏడాదిలోపే విడుదల కానున్నాయి. హరిహర వీరమల్లు సినిమా ఒక నెల రోజుల్లో పై విడుదల అయ్యే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. రాజా సాబ్ సినిమాను కూడా డిసెంబర్ 5న విడుదల చేయబోతున్నట్లు మూవీ మేకర్స్ ప్రకటించారు.
ఈ రెండు సినిమాలు ఒకే ఏడాది రిలీజ్ కాబోతుండడంతో నిధి అగర్వాల్ మళ్లీ టాలీవుడ్ లో ట్రెండింగ్ టాపిక్ గా మారింది. వీరమల్లు, రాజా సాబ్ రెండు సినిమాలు కూడా వేరు వేరు కథలతో వస్తున్నాయి. వీరమల్లు సినిమా పీరియాడికల్ కథతో ఒక బందిపోటు దొంగ కథతో వస్తుంటే రాజా సాబ్ మాత్రం థ్రిల్లర్ కథతో వస్తుంది. ఈ రెండు సినిమాలు కూడా హిట్టు పడితే మాత్రం నిధి తిరిగి ఫాం లోకి వస్తుందా అంటే తప్పకుండా వస్తుంది అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరి ఈ రెండు సినిమాలు ఈ ముద్దుగుమ్మకు ఏ మేరకు అవకాశాలను తెచ్చిపెడతాయే చూడాలి మరి.