రామ్ ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ఫిల్మ్ నగర్ టాక్

రామ్ ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ఫిల్మ్ నగర్ టాక్

ఎన‌ర్జిట‌క్ స్టార్ రామ్‌, డాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న చిత్రం ‘ఇస్మార్ట్ శంక‌ర్’. పూరి జ‌గ‌న్నాథ్ టూరింగ్ టాకీస్‌, పూరి క‌నెక్ట్స్ బ్యాన‌ర్స్‌పై పూరి జ‌గ‌న్నాథ్‌, ఛార్మి కౌర్ నిర్మిస్తున్నారు. రామ్ సరసన నిధి అగర్వాల్, నభా నటేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రస్తుతం అన్ని పనులు పూర్తి చేసుకున్న ఈ చిత్రం.. ఈ నెల 18న రిలీజ్ కు కు రెడీ అవుతోంది. పూరి జగన్నాథ్ సైతం ఈ సినిమాపై మంచి నమ్మకంగా ఉన్నారు.

గత కొంతకాలంగా పూరి జగన్నాథ్ ప్లాఫ్ ల్లో ఉన్నారు. హీరో రామ్ ది అదే పరిస్దితి. దాంతో వారి కాంబోలో రెడీ అయిన సినిమాకు ఎక్సపెక్టేషన్స్ కాస్త తక్కువే ఉంటాయి. అయితే ట్రైలర్ బాగా క్లిక్ అవ్వటంతో ఈ సినిమాకు మార్కెట్లో మంచి క్రేజే వచ్చింది.ముఖ్యంగా నైజాం లో ఈ సినిమాకు బాగా వర్కవుట్ అవుతుందని అంచనాలు ఉన్నాయి. ఈ నేపధ్యంలో ఇప్పటికే సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం పై ఫిల్మ్ నగర్ టాక్ ఏంటో చూద్దాం.

అందుతున్న సమాచారం మేరకు ఈ సినిమాలో తెలంగాణా యాస ఫుల్ గా డామినేట్ చేసింది. దాంతో తెలంగాణా ప్రాంతంలో సినిమా బాగా ఆడుతుందనే అంచనాలు ఉన్నాయి. అయితే స్టోరీ అంత గొప్పగా లేదని, డైరక్షన్ మాత్రం బాగుందని చెప్తున్నారు. ఫస్టాఫ్ సరదా సరదా గా పూరి మార్క్ డైలాగులతో నడిచే కథ,ఇంటర్వెల్ నుంచి వేరే టర్న్ తీసుకుంటుందని, సీరియస్ గా నడుస్తుందని అంటున్నారు. పూరి మార్క్ డైలాగులు మరీ మాస్ గా ఉన్నాయని అంటున్నారు. అయితే సెకండాఫ్ కనుక జనాలకు పడితే కనుక పెద్ద హిట్ అవుతుందని చెప్తున్నారు.

పూరి జగన్నాథ్‌ మాట్లాడుతూ ‘‘హైదరాబాదీ ఇస్మార్ట్‌ రౌడీ బుర్రలో పోలీసోళ్లు సిమ్‌ కార్డు పెట్టారు. అదెందుకో సినిమా చూసి తెలుసుకోవాలి. వినోదాత్మక కథ ఇది. రామ్‌ నటనే ప్రధాన ఆకర్షణ. ‘టెంపర్‌’ తరవాత నాకు మంచి హిట్టు పడలేదు. మంచి ఆకలితో ఉన్నప్పుడు రామ్‌ దొరికాడు. ప్రతి షాట్‌లో వంద శాతం ప్రతిభ చూపించాలనుకుంటాడు. మణిశర్మ మంచి పాటలు ఇచ్చారు. భాస్కరభట్ల, కాసర్ల శ్యామ్‌ మంచి సాహిత్యం అందించారు. బోనాల పాట మరింత హిట్టయ్యింది. బోనాల సమయంలోనే మా సినిమా విడుదల అవ్వడం ఆనందంగా ఉంది’’ అన్నారు.