`సాహో`లో ఊహించని అతిధి!
ప్రభాస్ -సుజీత్- యువి క్రియేషన్స్ బృందం `సాహో` ప్రచారాన్ని పరుగులు పెట్టిస్తున్న సంగతి తెలిసిందే. రోజుకో పోస్టర్ రిలీజ్ చేస్తూ వేడెక్కిస్తున్నారు. ఈ సినిమా నుంచి ఒక్కో పోస్టర్ అంతకంతకు హైప్ పెంచుతున్నాయి. ఆగస్టు 30 రిలీజ్ అని ప్రకటించారు కాబట్టి అందుకు తగ్గట్టే ప్రచారం హోరెత్తిపోతోంది. మెట్రోల్లో వరుస ఈవెంట్లతో సందడి చేయబోతున్నారు. ఫిలింసిటీ, దుబాయ్ ఈవెంట్లు స్పెషల్ అంటూ హడావుడి సాగుతోంది.
పోస్టర్ ట్రీట్ అదనం. ఇప్పటికే విలన్ల పోస్టర్లను రిలీజ్ చేశారు. ఇందులో నీల్ నితిన్, జాకీ ష్రాఫ్, అరుణ్ విజయ్ పోస్టర్లు ఫ్యాన్స్ కి మతిచెడే ట్రీటిచ్చాయి. శ్రద్ధా కపూర్ కొత్త పోస్టర్లతోనూ అదిరిపోయే ట్రీటిచ్చారు. అయితే వీటన్నిటినీ మించిన సరికొత్త ట్రీట్ ఇప్పుడే రివీలైంది. అదే ఈవ్ లీన్ శర్మ ట్రీట్. సాహో చిత్రంలో ముద్దుగుమ్మల గ్లామర్ షో కంటే స్టైలిష్ కంటెంట్ మైమరిపిస్తుందని అర్థమవుతోంది. తాజాగా ఈవ్ లిన్ లుక్ కుర్రకారు గుండెల్లోకి సూటిగా దూసుకెళుతోంది.