ప్రభాస్-ప్రశాంత్ నీల్… ఇద్దరిపై శృతి హాసన్ హాట్ కామెంట్స్

Sruthi hasan comments on prabhas and prashanth neel

శృతి హాసన్… కొన్ని రోజులు సినిమాలకు దూరంగా ఉన్న ఈ సెక్సీ బ్యూటీ ఇటీవలనే రవితేజతో కలిసి క్రాక్ సినిమాతో రీ ఎంట్రీ ఇవ్వటమే కాకుండా సూపర్ హిట్ సక్సెస్ అందుకుంది. ఆ వెంటనే పవన్ కళ్యాణ్ నటించిన ‘వకీల్ సాబ్’ సినిమా లో చిన్న పాత్రలో నటించి మెప్పించి మరో హిట్ తన ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం అమ్మడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న “సలార్” సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది.

Sruthi hasan comments on prabhas and prashanth neel

కేజీఎఫ్ తో సంచలనం సృష్టించిన ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో పాన్ ఇండియా సినిమాగా రూపొందుతున్న ఈ మూవీ షూటింగ్ లాక్ డౌన్ కారణంగా వాయిదా పడింది. అయితే ఇటీవల పరిస్థితులు చక్కబడటంతో సలార్ మూవీ తిరిగి ఇప్పుడు ఫుల్ స్పీడ్ లో చిత్రీకరణ జరుపుకుంటుంది. హీరో, హీరోయిన్ లకు సంబందించిన సన్నివేశాలను ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్నారు. గోదావరి ఖనిలో జరిగిన షెడ్యూల్‌లో పాల్గొన్న శృతి తాజాగా ప్రశాంత్ నీల్, ప్రభాస్ లను తెగ ప్రశంసించారు.

ప్రశాంత్ నీల్ సినిమా కోసం బాగా కష్టపడుతున్నారని, గొప్ప విజన్ ఉన్న దర్శకుడని కితాబిచ్చింది. సీన్స్ ని చాలా బాగా కమ్యూనికేట్ చేస్తారని, తనకు కావాల్సిన అవుట్ పుట్ కోసం పరితపిస్తారని తెలిపింది. అలానే డార్లింగ్ ప్రభాస్ చాలా సింపుల్ గా ఉంటారని అంతేకాకుండా అందరితో ఆయన చాలా ప్రేమతో మాట్లాడతారని, ప్రభాస్ సెట్లో ఉన్నంత సేపు సందడిగా ఉంటుందని… ఆయన ఎనర్జీ లెవెల్స్ వేరని పొగడ్తలతో ముంచేసింది.