రాజమౌళి ఆ పాన్ ఇండియా స్టార్ కి డబ్బింగ్ చెప్పారని మీకు తెలుసా?

తెలుగు చిత్ర పరిశ్రమలో దర్శకుడుగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న రాజమౌళి ఇండస్ట్రీలోకి రాకముందు బుల్లితెర సీరియల్స్ కు దర్శకత్వం వహించేవారు.ఇలా బుల్లితెరపై ప్రసారమవుతున్న శాంతినివాసం అనే సీరియల్ కి డైరెక్టర్ గా పనిచేసిన రాజమౌళి అనంతరం యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన స్టూడెంట్ నెంబర్ వన్ సినిమా ద్వారా వెండితెరకు దర్శకుడిగా పరిచయమయ్యారు.ఇలా ఈయన దర్శకుడిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకొని తెలుగు చిత్ర పరిశ్రమలోనే కాకుండా నేడు అంతర్జాతీయ స్థాయిలో ఇండస్ట్రీకి గర్వకారణంగా నిలిచారు.

ఈయన బాహుబలి సినిమా ద్వారా గుర్తింపు పొందారు. ఈ సినిమా తర్వాత రాజమౌళి దర్శకత్వం వహించిన త్రిబుల్ ఆర్ సినిమా ద్వారా ఏకంగా అంతర్జాతీయ స్థాయిలో దర్శకుడిగా ఎంతో ఆదరణ సంపాదించుకున్నారు. ఈ విధంగా దర్శకుడిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న రాజమౌళి కేవలం దర్శకత్వంలోనే కాకుండా డబ్బింగ్ కూడా చెప్పారనే విషయం చాలా మందికి తెలియదు.ఈయన ఇండస్ట్రీలో పాన్ ఇండియా హీరోగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ప్రభాస్ సినిమాకు డబ్బింగ్ చెప్పారట.

రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటించిన సినిమా చత్రపతి.ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి విజయాలను అందుకుందో మనకు తెలిసిందే. అయితే ఈ సినిమా మంచి హిట్ అవడంతో ప్రభాస్ రాజమౌళి కాంబినేషన్లో బాహుబలి సినిమా కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఈ సినిమా షూటింగ్ పూర్తి అయిన తర్వాత డబ్బింగ్ చెప్పడానికి ప్రభాస్ అందుబాటులో లేకపోవడంతో రాజమౌళి ఈ సినిమాకి డబ్బింగ్ చెప్పారని తెలుస్తోంది. అయితే ఈ సినిమాలో అది ప్రభాస్ వాయిస్ కాదని రాజమౌళి డబ్బింగ్ చెప్పారనే విషయం చాలామందికి తెలియదు.