పేమెంట్ ఎగ్గొట్టటంపై స్పందించిన ‘భరత్ అనే నేను’ ప్రొడ్యూసర్

ప్రముఖ ప్రొడ్యూసర్ భరత్ అనే నేను సినిమా టెక్నీషియన్ల పేమెంట్ ఎగ్గొట్టారంటూ వార్త ప్రచారమవుతోంది. ముఖ్యంగా ఆ సినిమాకి దర్శకత్వం వహించిన కొరటాల శివ, హీరోయిన్ కైరా అద్వానీ పేర్లు బాగా వినిపించాయి. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ఆరోపణలు చేస్తూ కొన్ని కధనాలు వచ్చాయి. వాటిలో వాస్తవం లేదంటూ ఆ సినిమా ప్రొడ్యూసర్ డీవీవీ దానయ్య స్పందించారు.

‘ప్రొడక్షన్ హౌస్ మీద వచ్చిన రూమర్లు నన్ను బాగా ఇబ్బంది పెట్టాయి. భరత్ అనే నేను చిత్రానికి సంబంధించి నేను ఎవరికీ, ఎలాంటి పేమెంట్లు ఎగ్గొట్టలేదు. ఇంకా ఎవరికైనా దీని గురించి అనుమానాలు ఉంటే నేరుగా హైద్రాబాదులోని మా ఆఫీసుకు వచ్చి ఎంక్వయిరీ చేసుకోవచ్చు . దయచేసి ఇలాంటి కధనాలు ఇకనుండి ప్రచురించకండి అని జర్నలిస్టులకు విజ్ఞప్తి చేశారు’.