అగ్ర హీరో బాలకృష్ణతో కూడా మూవీ చేయాలని యోచిస్తున్నారట దిల్ రాజు హిందీ చిత్రం ‘పింక్’ను తమిళంలో హీరో అజిత్‌తో ‘నెర్కొండ పర్వాయ్’ పేరుతో రీమేక్ చేశారు. ఈ మూవీని చూసిన దిల్ రాజు.. బాలకృష్ణ ఒకే అంటే తెలుగులో కూడా నిర్మించేందుకు సిద్ధంగా ఉన్నారట. అంతేకాదు ఈ మూవీకి ‘లాయర్ సాబ్’ అనే టైటిల్‌ను కూడా పరిశీలించారట. దివంగత నటి శ్రీదేవి భర్త బోనీ కపూర్ నిర్మాణ భాగస్వామ్యంతో తెలుగులో ఈ సినిమాను రూపొందించాలని భావిస్తున్నారట. తెలుగులో హిట్ అయిన ‘ఎఫ్2’ చిత్రాన్ని హిందీలో వీరి నిర్మాణ భాగస్వామ్యంలో నిర్మిస్తున్నారు. ఇప్పుడు ఈ భాగస్వామ్యాన్ని ‘లాయర్ సాహెబ్’ ద్వారా తెలుగులో కూడా కొనసాగించాలని యోచిస్తున్నారట దిల్ రాజు. ఇప్పటికే నాగార్జున, వెంకటేశ్‌తో దిల్ రాజు సినిమాలు నిర్మించి హిట్‌లు అందుకున్నారు. ఇప్పుడు చిరంజీవి, బాలయ్యతో కూడా సినిమాలు చేసి దాదాపు టాలీవుడ్ అగ్రహీరోలందరితో సినిమాలు నిర్మించిన నిర్మాతగా నిలిచిపోవాలని దిల్ రాజు అనుకుంటున్నారట. మరి బాలకృష్ణ ‘లాయర్ సాబ్’ సినిమాపై త్వరలో ప్రకటన చేస్తారేమో చూడాలి.