పాశ్చాత్య దేశాలతో పోలిస్తే భారతదేశంలో ఫుట్ బాల్ క్రీడకు ఉన్న ఆదరణ తక్కువే. కానీ ఈ ఆటను పిచ్చిగా అభిమానించే ఒక సెక్షన్ ఫ్యాన్స్ కి కొదవేమీ లేదు. తాజా సమాచారం ప్రకారం..ఇండియన్ సూపర్ లీగ్‌లోని నగరానికి చెందిన ఫుట్‌బాల్ జట్టు హైదరాబాద్ ఎఫ్‌సి, ప్రపంచంలోని ఉత్తమ ఫుట్‌బాల్ క్లబ్‌లలో ఒకటైన బోరుస్సియా డార్ట్మండ్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ప్రకారం, భారతదేశంలో డార్ట్మండ్ అధికారిక క్లబ్ భాగస్వామిగా హైదరాబాద్ ఎఫ్.సిని ప్రకటించారు.
జట్టు సహ యజమానులలో ఒకరైన రానా దగ్గుబాటి చారిత్రాత్మక భాగస్వామ్యం గురించి వెల్లడించారు. ఈ భాగస్వామ్యం గురించి మరిన్ని వివరాలను ఆగస్టు 20 న బోరుస్సియా డార్ట్మండ్ వర్చువల్ ఆసియా టూర్ సందర్భంగా ప్రకటించబోతున్నారు.
ఈ భాగస్వామ్యం హైదరాబాద్ ఎఫ్‌సిని ప్రపంచ పటంలో ప్రత్యేకంగా నిలబెడుతుందని, ఇది భారత ఫుట్‌బాల్ వ్యవస్థకు పెద్ద బలం అవుతుందని .. ఇక ఈ క్రీడ బాగా పుంజుకుంటుందని భావిస్తున్నారు. భారతీయ ఫుట్‌బాల్ అభిమానులకు స్పెషల్ ట్రీట్ మునుముందు ఉంటుంది.. ఫుట్ బాల్ క్రీడకు ఇక్కడ బోలెడంత భవిష్యత్ ని ఇస్తుందన్న భరోసా లభించినట్టేనని చెబుతున్నారు.