Bahubali The Epic: బాహుబలి ది ఎపిక్ రన్ టైం పై రానా క్లారిటీ.. జక్కన్న ప్లానింగ్ అదుర్స్?

Bahubali The Epic: ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ రానా హీరోలుగా నటించిన చిత్రం బాహుబలి. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎన్నో అద్భుతమైన విజయాలను సొంతం చేసుకుంది. అయితే ఈ సినిమా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమా ద్వారా ప్రభాస్ రానా వంటి వారు పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి క్రేజ్ సొంతం చేసుకున్నారు. ఇకపోతే ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున రీ రిలీజ్ ట్రెండ్ కొనసాగుతోంది. ఈ క్రమంలోనే బాహుబలి సినిమాని కూడా రీ రిలీజ్ చేయబోతున్నారు అయితే ఈ రెండు భాగాలు కలిపి కథ ఎక్కడ డిస్టర్బ్ కాకుండా పూర్తిగా ఎడిట్ చేస్తూ ఒకే సినిమాగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి జక్కన్న సిద్ధమయ్యారు.

ఇక ఈ సినిమా అక్టోబర్ 31వ తేదీ ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతుందని ఇటీవల బాహుబలి సినిమా విడుదల పదేళ్ల సందర్భంగా రాజమౌళి రిలీజ్ కి సంబంధించి అప్డేట్ ఇచ్చారు. అయితే ఈ సినిమా సుమారు 5 గంటల పాటు రన్ టైం ఉంటుందంటూ ఇదివరకు వార్తలు వచ్చాయి. తాజాగా ఈ సినిమా రన్ టైం గురించి రానా దగ్గుబాటి స్పందించారు. ఈ సందర్భంగా రానా మాట్లాడుతూ బాహుబలి ది ఎపిక్ రన్ టైం ఎంత నిడివి ఉన్నా నాకు చాలా ఆనందం. ఎందుకంటే ఈ ఏడాదిలో నేను ఏ సినిమాలో నటించకుండానే నాకు బ్లాక్‌బస్టర్‌ రానుంది. రన్‌టైమ్‌ ఎంతనేది నాకు కూడా చెప్పలేదు. నాలుగు గంటలు అని పోస్ట్‌లు పెడుతున్నారు.

అంత నిడివి ఉంటే చూస్తారా!. దీని నిడివి కేవలం రాజమౌళికి మాత్రమే తెలుస్తుంది. ఆయన చెప్పేవరకూ ఎవరికీ తెలియదు. నాకైతే అతను ఏమి చెప్పలేదు అంటూ రానా చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. అయితే ఈ రెండు సినిమాలను కుదించి ఒక సినిమాగా తీసుకురాబోతున్న నేపథ్యంలో రాజమౌళి మరొక అద్భుతాన్ని సృష్టిస్తారని అభిమానులు భావిస్తున్నారు. మరి బాహుబలి ది ఎపిక్ ఎలా ఉండబోతుంది ఏంటి అనేది తెలియాల్సి ఉంది.