స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్… అల వైకుంఠపురంలో సినిమా హిట్ తో మాంచి జోష్ మీదున్నాడు. అంతే కాదు.. అల్లు అర్జున్ టాలీవుడ్ లో స్టార్ హీరో. నా పేరు సూర్య సినిమా ప్లాఫ్ అయినప్పటికీ.. ఆయన స్టార్ డమ్ ఏమాత్రం తగ్గలేదు. అల వైకుంఠపురంలో సినిమాతో మళ్లీ పుంజుకున్నాడు. ఇప్పుడు వరుస పెట్టి సినిమాలు చేస్తున్నాడు. చాలామంది డైరెక్టర్లు అల్లు అర్జున్ తో సినిమా తీయాలని ఎదురుచూస్తున్నారు.

ఇక.. అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో పుష్ప అనే సినిమాలో నటిస్తున్నాడు. రష్మిక మందన్న హీరోయిన్. సినిమా షూటింగ్ కూడా శరవేగంగా నడుస్తోంది. అయితే.. ఈ సినిమాలో నటించే నటుల్లో ఎక్కువమంది నార్త్ కు చెందిన వాళ్లేనట.
ఈ సినిమాకు సంబంధించిన తాజా అప్ డేట్ ఏంటంటే… సినిమాలో వచ్చే ఒక్క యాక్షన్ ఎపిసోడ్ కోసం ఏకంగా 6 కోట్ల రూపాయలను ఖర్చు చేస్తున్నారట. నిజానికి సినిమా మొత్తం ఎక్కువగా అడవుల నేపథ్యంలో ఉంటుంది. చిత్తూరు జిల్లాలో ఉన్న శేషాచలం అడవుల్లో జరిగే ఎర్రచందనం స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్ లో కథ నడుస్తుంటుంది. అంతే కాదు.. సినిమా పూర్తిగా మాస్ మసాలా ఎంటర్ టైనర్ గా ఉండేలా సుకుమార్ తెరకెక్కిస్తున్నాడు. అందుకే సుకుమార్ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా… ఒక యాక్షన్ సీక్వెన్స్ కోసమే ఏకంగా 6 కోట్లు ఖర్చు చేస్తున్నాడు.
ఈ యాక్షన్ ఎపిసోడ్.. హీరో, విలన్ మధ్య సాగుతుందని… దాని కోసమే సెట్స్ వేస్తున్నట్టు మూవీ యూనిట్ తెలిపింది. ముందుగా ఈ సినిమాలో విలన్ రోల్ కోసం తమిళ్ హీరో విజయ్ సేతుపతిని అనుకున్నారు. కానీ.. ఆయన ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నారు. అయితే.. ఈ సినిమాలో విలన్ రోల్ కు మరొకరు ఎవరిని తీసుకున్నారో మాత్రం మూవీ యూనిట్ చెప్పలేదు.
కాకపోతే ఈ సినిమాలో విలన్ రోల్ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంటుందట. అందుకే అప్పుడు విజయ్ సేతుపతిని ఎంచుకున్నారు. కానీ.. ఆయన తప్పుకోవడంతో మళ్లీ అంతటి బలం ఉండే క్యారెక్టర్ చేసే నటుడు ఎవరిని తీసుకున్నారో?
ఏదిఏమైనా.. ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా… సినిమాను ఇంతలా సుకుమార్ చెక్కుతున్నాడంటే.. సినిమా మాత్రం ఆస్కార్ లేవల్ కు వెళ్లాల్సిందే.. అంటూ బన్నీ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
