జెడి చక్రవర్తి గురించి సంచలన వ్యాఖ్యలు చేసిన రంభ… అబద్దాలకోరు అంటూ కామెంట్స్!

తెలుగు చిత్ర పరిశ్రమలో నటుడు జేడీ చక్రవర్తి రంభ జంటకు ఎలాంటి క్రేజ్ ఉందో మనకు తెలిసిందే. వీరిద్దరూ పలు సినిమాలలో నటించి ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. ఇలా ఈ జంటకు విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. ఇకపోతే రంభ ఇండస్ట్రీలో ఎంతోమంది అగ్ర హీరోలు అందరు సరసన నటించి ఎంతో మంచి గుర్తింపు పొందారు. ప్రస్తుతం ఈమె పెళ్లి చేసుకొని పూర్తిగా ఇండస్ట్రీకి దూరమై విదేశాలలో స్థిరపడ్డారు.ఇకపోతే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి రంభ నటుడు జెడి చక్రవర్తి గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఈ సందర్భంగా రంభ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తను జెడి చక్రవర్తి ఇద్దరు చాలా మంచి స్నేహితులమని తెలిపారు. ఇలా తనతో ఇంత మంచి ఫ్రెండ్షిప్ ఉన్నప్పటికీ తను మాత్రం నా పెళ్ళికి రాలేదని అందుకు తను చాలా అప్సెట్ అయ్యానని రంభ తెలిపారు. జెడి చక్రవర్తి ఫ్రెండ్షిప్ నిలబెట్టుకునే విషయంలో పూర్తిగా అబద్దాలు చెబుతాడని…తాను పచ్చి అబద్దాలకోరు అంటూ రంభ ఈ సందర్భంగా జెడి చక్రవర్తి గురించి కామెంట్స్ చేశారు. ఈ క్రమంలోనే ఈమె చేసినటువంటి ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

ఇకపోతే రంభ వివాహం తర్వాత పూర్తిగా ఇండస్ట్రీకి దూరమయ్యారు అయితే ఈమెకు మంచి అవకాశాలు కనుక వస్తే తిరిగి ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానని తెలిపారు. మరి ఈమెకు ఏ దర్శకుడు అవకాశం కల్పిస్తారో తెలియాల్సి ఉంది.ఇకపోతే రంభ కేవలం హీరోయిన్ గా మాత్రమే కాకుండా తారక్ నటించిన నాగ అల్లు అర్జున్ నటించిన బన్నీ సినిమాలలో ఐటమ్ సాంగ్ లలో నటించి సందడి చేశారు.ఇక ఇండస్ట్రీలో చిరంజీవి వెంకటేష్ బాలకృష్ణ వంటి హీరోల సరసన కూడా నటించి మెప్పించారు.