క‌రోనా విరుగుడుకు ఫావివిర్ ట్యాబ్లెట్ ధ‌ర ఎంతంటే?

హైదరాబాద్‌కు చెందిన హెటెరో కోవిడ్ -19 ఔషధం ఫావివిర్‌ను మార్కెట్లోకి విడుద‌ల చేసింది. ఈ మందు బిళ్ల బ‌హిరంగ మార్కెట్లో ధ‌ర ఎంత‌? అంటే టాబ్లెట్‌కు రూ .59 చొప్పున వ‌సూల్ చేస్తున్నారు. ఫావివిర్ టాబ్లెట్ జూలై 29 నుండి దేశంలోని అన్ని రిటైల్ మెడికల్ ఔట్‌లెట్లలో లభిస్తోంది. అయితే డాక్ట‌ర్ ప్రిస్క్రిప్షన్‌ ఉంటేనే దీనిని విక్రయిస్తారు.

తాజా ప‌త్రికా ప్ర‌క‌ట‌న‌లో హెటిరో సంస్థ ప్ర‌భుత్వ అనుమ‌తులు ల‌భించాయ‌ని ప్ర‌క‌టించింది. హెటిరో ఫావిపిరవిర్‌కు డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డిసిజిఐ) నుండి తయారీ & మార్కెటింగ్ అనుమతి లభించింది. కోవిడ్-19 చికిత్సలో ఉపయోగించిన కోవిఫోర్ (రెమ్‌డెసివిర్) తర్వాత హెటెరో అభివృద్ధి చేసిన రెండవ  ఔషధం ఫావివిర్.

ఇది నోటి ద్వారా తీసుకోవాల్సిన‌ యాంటీవైరల్ మందు అని క్లినిక‌ల్ గా సానుకూల ఫలితాలను అందించిందని సంస్థ తెలిపింది. దీంతో కోవిడ్ రోగుల‌కు మరింత భ‌రోసా ల‌భించిన‌ట్టేన‌ని వెల్ల‌డించింది.  హెటెరో హెల్త్‌కేర్ లిమిటెడ్ ఈ మందు బిళ్ల‌ల‌ను విక్రయించి పంపిణీ చేస్తుంది. జూలై 29 నుండి దేశంలోని అన్ని రిటైల్ మెడికల్ ఔట్‌లెట్లు, హాస్పిటల్ ఫార్మసీలలో లభిస్తుంది. ఈ ఔషధాన్ని భారతదేశంలోని సంస్థ ప్రపంచ స్థాయి ప్రామాణిక‌త‌తో తయారు చేస్తున్నారు. దీనిని యుఎస్‌ఎఫ్‌డిఎ.. ఎంతో కఠినమైన ప్రపంచ నియంత్రణ అధికారులు ఆమోదించారు.