ఇండస్ట్రీ టాక్ : “గాడ్ ఫాదర్” కి తెలుగు రాష్ట్రాల్లో టికెట్ ధరలు ఇంతే..!

టాలీవుడ్ నుంచి స్కేల్ పెరిగే కొద్దీ కొన్ని భారీ సినిమాలు అంతకంతకు వస్తున్నాయి. దీనితో ఆ ఖర్చుకి గాని నిర్మాతల డిమాండ్ మేరకు టికెట్ ధరలు పెంపు అనేది ఎప్పుడు నుంచో పెరుగుతూ వచ్చింది. అలా తెలుగు రాష్ట్రాల్లో రెండు ప్రభుత్వాలు కూడా పెద్ద హీరోల అన్ని సినిమాలకి హైక్స్ ఇవ్వడం అనేది ఆనవాయితి గా మారింది.

ఇదంతా బాగానే ఉన్నా ఒకానొక సందర్భాల్లో ఇది మరీ ఎక్కువ అయిపోవడంతో ఆడియెన్స్ కి చిరాకు వచ్చేసింది. దీనితో మెగాస్టార్ సినిమాలకే భారీ నష్టాలే తప్పలేదు. అయితే ముందు గరిష్టంగా ఉన్న 200 కి మించి పెంచడంతో బాగా సినిమాలు ఎఫెక్ట్ అయ్యాయి.

దీనితో మెగాస్టార్ సహా ఇతర టాలీవుడ్ ప్రముఖులు చేసిన రిక్వెస్ట్ లు ఇప్పుడు వెనక్కి తీసుకున్నారు. అయితే ఆచార్య సమయానికి కూడా మెగాస్టార్ భారీ హైక్స్ తెలుగు స్టేట్స్ నుంచి పొందారు కానీ ఇప్పుడు గాడ్ ఫాదర్ విషయంలో మాత్రం ఇప్పుడు ఎలాంటి హైక్ తీసుకోలేనట్టు తెలుస్తుంది.

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎలా ఉన్న ధరలు అలాగే కొనసాగుతాయని తెలుస్తుంది. గరిష్టంగా 175 ఏపీ లో అలాగే తెలంగాణాలో కూడా ఇంతే మేర ఉండనున్నట్టు తెలుస్తుంది. అక్కడ సింగిల్ స్క్రీన్ లో 150 మల్టీప్లెక్స్ లో 200 ఉంటాయని టాక్. దీనితో అయితే గాడ్ ఫాదర్ ఈసారి సాధారణ రేట్స్ కే అందుబాటులో ఉన్నాడని చెప్పాలి.