సీఎం జ‌గ‌న్ బ‌యోపిక్ లో బ‌న్నీ?

మ‌ల‌యాళ న‌టుడు మోహ‌న్ లాల్ వైఎస్సార్ పాత్ర‌లో న‌టించిన` యాత్ర` చిత్రం తెలుగు లో చ‌క్క‌ని విజ‌యం ద‌క్కించుకున్న సంగ‌తి తెలిసిందే. మ‌హి. విరాఘ‌వేంద్ర ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సినిమాతో డైరెక్ట‌ర్ కు మంచి పేరొచ్చింది. దివంగ‌త ముఖ్య‌మంత్రి వైఎస్సార్ ఎన్నిక‌ల‌కు ముందు చేప‌ట్టిన పాద‌యాత్ర ను ఇతివృత్తంగా తీసుకుని దీన్ని తెర‌కెక్కించారు. వైఎస్సార్ పాత్ర‌లో మ‌మ్ముట్టి ఒదిగిపోయిన వైనం తెలుగు నాట ఆయ‌న‌కు ప్ర‌త్యేక‌మైన గుర్తింపును తీసుకొచ్చింది. ఈ సినిమా రిలీజ్ త‌ర్వాత ఆ చిత్ర ద‌ర్శ‌కుడ్ని సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి త‌న ఇంటికి పిలిపించుకుని స‌న్మానించారు.

ఈ నేప‌థ్యంలోనే యంగ్ సీఎం జ‌గ‌న్ మెహ‌న్ రెడ్డి ప్ర‌జా సంక‌ల్ప యాత్ర నేప‌థ్యంలోగానీ, జ‌గ‌న్ జీవి క‌థ గానీ మ‌రో సినిమా గా చేస్తాన‌ని ప్ర‌క‌టించారు. జ‌గ‌న్ అనుమ‌తి ఇవ్వ‌డ‌మే ఆల‌స్యం. స్ర్కిప్ట్ సిద్దం చేసి వాయు వేగంగా షూటింగ్ పూర్తిచేస్తాన‌ని అన్నారు. అయితే ఇప్పుడా స‌మ‌యం ఆస‌న్న‌మైన‌ట్లుంది. ఇటీవ‌లే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఆ డైరెక్ట‌ర్ తో ఓ సినిమా చేస్తున్న‌ట్లు జోరుగా ప్ర‌చారం సాగుతోంది. యాత్ర సినిమా చూసిన త‌ర్వాత బ‌న్నీ మ‌హితో ఓ సినిమా చేయాల‌ని చాలా రోజుల క్రిత‌మే డిసైడ్ అయ్యాడుట‌. ఈ నేప‌థ్యంలోనే ఇటీవ‌లే బ‌న్నీ త‌న ఆఫీస్ కి పిలిపించి మాట్లాడారుట‌. బ‌యోపిక్ నేప‌థ్యం గ‌ల క‌థ ఏదైనా ఉంటే సిద్దం చేయ‌మ‌ని చెప్పాడుట‌.

ఆ స‌మ‌యంలో మ‌హి వ‌ద్ద రెడీగా ఉన్న జ‌గ‌న్ ప్ర‌జా సంక‌ల్ప యాత్ర స్ర్కిప్ట్ గురించి వివ‌రించారుట‌. ఆ స్ర్కిప్ట్ బాగుంద‌ని..క‌థ‌కు కావాల్సిన క‌మ‌ర్శియ‌ల్ అంశాలు పుష్క‌లంగా ఉన్నాయ‌ని బ‌న్నీ ఎగ్జైట్ అయ్యాడుట‌. అయితే ఈ క‌థ క‌న్నా జ‌గ‌న్ లో కేవ‌లం లీడ‌ర్ షిప్ క్వాలిటీని ఎలివేట్ చేస్తూ రాజ‌కీయాల‌తో సంబంధం లేని బ‌యోపిక్ అయితే ఇంకా బాగుంటుంద‌ని సూచించాడుట‌. దీంతో మ‌హి కూడా ఐడియా బాగుంద‌ని…వ‌ర్కౌట్ చేస్తే ఇద్ద‌రి ఇమేజ్కి క‌లిసొస్తుంద‌ని భావిస్తున్నాడుట‌. అంటే మ‌ణిర‌త్నం తెర‌కెక్కించిన `యువ` త‌ర‌హాలో స్ర్కిప్ట్ సిద్దం చేస్తే బాగుంటుంద‌ని మ‌హి అనుకుంటున్నాడ‌ని ఆయ‌న స‌న్నిహిత వ‌ర్గాల నుంచి లీకైంది.