బ‌న్నీ మైండ్ బ్లాక్ చేసిన వైజాగ్ ఫ్లైట్ గాళ్స్

అల్లు అర్జున్ – పూజా హెగ్డే నాయ‌కానాయిక‌లుగా న‌టించిన అల వైకుంఠ‌పుర‌ములో సంక్రాంతి బ్లాక్ బ‌స్ట‌ర్ గా నిలిచిన సంగ‌తి విధిత‌మే. ఈ మూవీ నుంచి వచ్చిన చార్ట్ బస్టర్ రొమాంటిక్ డ్యాన్స్ నంబర్ `బుట్ట బొమ్మా..` యువతరంలో విప‌రీతంగా పాపుల‌రైంది. సాంగ్ విడుదలై చాలా కాల‌మే అయినా ఈ పాట చార్ట్ లో ఇంకా టాప్ పొజిష‌న్ లోనే ఉంది. ప్ర‌పంచ‌వ్యాప్తంగా ప‌లు దేశాల్లో ఈ పాట వైర‌ల్ అవుతూనే ఉంది. దీనికి ఇమ్మిటేష‌న్ స్టెప్పులు అంతే వైర‌ల్ గా మారాయి.

తాజాగా వైజాగ్ విమానాశ్రయంలో చిత్రీక‌రించిన ఓ వీడియో అంతే వైర‌ల్ గా మారింది. ఒక ప్రైవేట్ విమాన‌యాన కంపెనీకి చెందిన పలువురు క్యాబిన్ సిబ్బంది బుట్టా బొమ్మ అంటూ అత్య‌ద్భుతంగా ల‌య బ‌ద్ధంగా స్టెప్పులు వేస్తున్న వీడియో ఇది. ప్ర‌స్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అల్లు అర్జున్ ను ఇది విప‌రీతంగా ఆకట్టుకుంది.

https://twitter.com/SKNonline/status/1285151970559275010

“ఈ తక్కువ కాలంలో ఎంత ఆనందకరమైన ఆశ్చర్యక‌ర‌మైన విష‌యం ఇదీ. ధన్యవాదాలు“ అని బ‌న్ని ట్వీట్ చేశారు. బుట్ట బొమ్మా పాట‌కు ఇంత‌కుముందు ఆస్ట్రేలియ‌న్ క్రికెటర్ డేవిడ్ వార్న‌ర్ స‌తీస‌మేతుడై స్టెప్పులేసిన వీడియో ఎంతో అల‌రించిన సంగ‌తి తెలిసిందే. ఈ వీడియోకి బ‌న్ని రెస్పాండ్ అయ్యి ఆనందం వ్య‌క్తం చేశాడు.

This time, it's 'Butta Bomma' for Australian cricketer Warner