బిగ్ అప్డేట్ : “హరిహర వీరమల్లు” నుంచి గ్రాండ్ ట్రీట్ కి సమయం సిద్ధం.!

గాడ్ ఆఫ్ మాసెస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ఇప్పుడు పలు భారీ సినిమాలు ఓకే చేశారు. ఇక ఈ గ్యాప్ లో రేపు సెప్టెంబర్ 2న పవన్ పుట్టినరోజు కావడంతో అభిమానులు కూడా పెద్ద ఎత్తున గ్రాండ్ గా వేడుకలకి సిద్ధం చేసేసారు.

పవర్ స్టార్ బర్త్ డే సందర్భంగా పలు సినిమాల రీ రిలీజ్ లు పవన్ కొత్త సినిమాల అప్డేట్స్ తో ఆ రోజు మాత్రం హోరెత్తిపోనుంది అని ఇప్పుడు అయితే క్లారిటీ వచ్చేసింది. ఇక ఇదిలా ఉండగా దర్శకుడు క్రిష్ జాగర్లమూడి తో చేస్తున్న భారీ పాన్ ఇండియా సినిమా “హరిహర వీరమల్లు” నుంచి పవన్ బర్త్ డే ట్రీట్ గా ఓ భారీ ట్రీట్ సిద్ధం చేసినట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.

ఇప్పుడు దీనిని నిజం చేస్తూ ఆ బిగ్ అప్డేట్ అయితే బయటకి వచ్చేసింది. హరిహర వీరమల్లు సినిమా నుంచి ఒక పవర్ ఫుల్ వీడియో టీజర్ ని అయితే ఈ సెప్టెంబర్ 2న సాయంత్రం 5 గంటల 45 నిమిషాలకి రిలీజ్ చేస్తున్నట్టు క్రేజీ అప్డేట్ ని ఈరోజు వినాయక చవితి కానుకగా అందించారు.

దీనితో పాటుగా విడుదల చేసినటువంటి పోస్టర్ కూడా బాగుంది. ఇంకా ఈ సినిమాలో అయితే నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా బాలీవుడ్ నుంచి నపూర్ సనన్ కీలక పాత్రలో నటిస్తుంది. అలాగే ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తుండగా మెగాసూర్య ప్రొడక్షన్స్ వారు సుమారు 150 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాని నిర్మాణం వహిస్తున్నారు.