ఇది కరోనా నామ సంవత్సరంగా మారింది. ప్రపంచం మొత్తం ఎక్కడ చూసినా ఈ కరోనా గోలే. అక్కడా ఇక్కడా అని తేడా లేకుండా కరోనా అందరినీ ఖతం చేసేస్తోంది. కరోనా దెబ్బకు అన్ని దేశాల ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలాయి. ఉద్యోగాలు కూడా పోయాయి.
అయితే కరోనా వచ్చినా చాలామంది తొందరగా రికవరీ అవుతున్నారు. ఎక్కువగా ఏదైనా వేరే ఆరోగ్య సమస్యలు ఉన్నవాళ్లే ఈ కరోనా బారిన పడుతున్నారు. ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొందరైతే కనీసం ఆసుపత్రికి కూడా వెళ్లకుండానే తామంతట తామే ఇంట్లో ఉండే డాక్టర్ల సలహాలు తీసుకొని క్యూర్ అవుతున్నారు.
ఇక.. ఈ కరోనా రాజకీయ నాయకులను, సినిమా సెలబ్రిటీలను కూడా వదల్లేదు. చాలామంది సెలబ్రిటీలు కరోనా బారిన పడ్డారు. కొందరు తొందరగానే రికవరీ అయినప్పటికీ.. ఇంకొందరు మాత్రం రికవరీకి చాలా టైమ్ తీసుకుంటున్నారు. అందులో ఎస్పీ బాలు ఒకరు.
నిజానికి ఎస్పీ బాలుకు అంతగా ఆరోగ్య సమస్యలు ఏవీ లేవు. ఆయన ఎప్పుడూ ఆసుపత్రికి వెళ్లినట్టుగా వార్త కూడా రాలేదు. కానీ.. ఆయనకు కరోనా సోకడం, అప్పటి నుంచి ఆయన క్రిటికల్ గా ఉండటం అనేక అనుమానాలకు తావిస్తోంది.
ఇప్పటికీ ఆయన పరిస్థితి విషమంగానే ఉన్నట్టు తెలుస్తోంది. ఇంకా ఆయన ఐసీయూలోనే ఉన్నారు. కరోనాతో తీవ్రంగా పోరాడుతున్నారు. ఆయన కరోనా నుంచి తప్పించుకొని త్వరగా ఇంటికి రావాలని కోరుకోని వారు లేరు. ఆయన అభిమానుల దగ్గర్నుంచి సెలబ్రిటీల వరకు అందరూ ఆయన త్వరగా కోరుకోవాలని దేవుడిని వేడుకుంటున్నారు.
అయితే.. బాలు కరోనాతో విషమ స్థితిలోకి వెళ్లడానికి కారణం ఇంకోటి ఉంది అని తెలుస్తోంది. గత సంవత్సరం బాలసుబ్రహ్మణ్యం.. బేరియాట్రిక్ సర్జరీ చేయించుకున్నారట. అదే ఇప్పుడు ఆయనకు తిరగబడిందట.
బాలు బరువు ఎక్కువగా ఉంటారని అందరికీ తెలిసిందే. వయసు పెరిగిపోతున్నా కొద్దీ ఆయన బరువు తగ్గకపోతుండటంతో.. ఇంకా బరువు పెరిగితే సమస్యలు వస్తాయేమోనని.. ఆయన బేరియాట్రిక్ సర్జరీ చేయించుకున్నారట.
అందుకే ఆ మధ్య ఆయన కాస్త సన్నబడ్డట్టు కనిపించారు. అయితే.. ఈ సర్జరీ వల్ల కొన్ని అవయవాలు దెబ్బతిన్నాయట. సర్జరీ తర్వాత కొన్ని సమస్యలు కూడా వచ్చాయట. అయినా మళ్లీ క్యూర్ అయిందట. ఇప్పుడు కరోనా మహమ్మారి రావడం.. అది కూడా వీక్ గా ఉన్న అవయవాలను అటాక్ చేయడం జరిగిందట. అందుకే బాలు ఆరోగ్య పరిస్థితి కొంచెం ఆందోళనకరంగా ఉన్నట్టు తెలుస్తోంది.
ఏదిఏమైనా.. బాలు కరోనాను జయించి.. త్వరగా ఇంటికి చేరుకోవాలని మనమూ ప్రార్థిద్దాం.