Home Tollywood హీరోయిన్ని తల్లిని చేసేస్తున్నారట !

హీరోయిన్ని తల్లిని చేసేస్తున్నారట !

మన సమాజంలో మనిషికి ఉన్న అతి పెద్ద జబ్బు అల్లా ఏదైనా ఉంది అంటే.. అది పక్కోడికి ఉచిత సలహా పడేయడమే. అక్కడికి ఏదో మనం గొప్పగా బతుకున్నట్లు, అన్ని పనులు మనం గొప్పగా నిర్వహిస్తున్నట్లు కనబడ్డ ప్రతోడికి సూచనలు చేస్తూ పోతుంటాం. ఈ క్రమంలో వచ్చే కామన్ ప్రాబ్లమ్ పెళ్లి. పెళ్లి అయ్యేదాకా ‘పెళ్లి ఎప్పుడూ’ అనే ప్రశ్నలతోనే విరక్తి కలిగిస్తారు. ఇక ఎలాగోలా పెళ్లి చేసుకుంటే.. అంతలో ‘పిల్లలు ఎప్పుడూ’ అనే మరో ప్రశ్నతో పెళ్లి అయిందనే అనందాన్ని లేకుండా చేస్తారు. మనిషికి ప్రాధమిక బాధ్యతలా మారిన ఈ పెళ్లి వ్యవస్థ హీరోయిన్లను కూడా ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.

ప్రస్తుతం అలాంటి ఉక్కిరిబిక్కిరి పరిస్థితుల్లోనే ఇబ్బంది పడుతూ ఉంది ‘అనుష్క శర్మ’. చాలా ఏళ్ల నుండి గ్యాప్ లేకుండా గ్లామర్ ప్రపంచలో తన అందచందాలను అవలీలగా ప్రదర్శిస్తూ వస్తోన్న ‘అనుష్క శర్మ’ను ఇప్పుడు ప్రతిఒక్కరు పిల్లలు ఎప్పుడూ అని మొహమాటం లేకుండా అడుగుతున్నారట. మధ్యలో కొంత విరామాన్ని తీసుకోవాలనే ఉద్దేశ్యంతో సినిమాలను తగ్గిస్తే.. ‘అనుష్క శర్మ’ తల్లి కావడానికే విరామం తీసుకుందని తోటి బాలీవుడ్ సన్నిహితులే పుకార్లు పుట్టిస్తున్నారట. ఆ మధ్య ఓ బాలీవుడ్ ప్రముఖ పత్రిక కూడా అనుష్క శర్మ తల్లి కాబోతుందని సినిమా మెయిన్ ఎడిషన్ లో మెయిన్ ఆర్టికల్ గా రాసుకొచ్చింది.

అయితే ఇలాంటి వార్తల్లో ఎలాంటి నిజం లేదని స్వయంగా అనుష్క శర్మనే డిజిటల్ మీడియా ద్వారా స్పష్టం చేసినా.. ఆమె తల్లి కాబోతుంది అనే వార్త మాత్రం అస్సలు ఆగడం లేదు. ఎంతైనా బాలీవుడ్ భామ కదా. అందులో స్టార్ క్రికెటర్ సతీమణి అయ్యే. మరి ఆ మాత్రం క్రేజ్ ఉంటుంది, కాకపోతే ఆ క్రేజ్ పర్సనల్ లైఫ్ ను కూడా డిస్టర్బ్ చేసేలా ఉండకూడదు అనే విషయన్ని అందరూ అర్ధం చేసుకుంటే.. ‘అనుష్క శర్మ’హీరోయిన్స్ సినిమాలకు తమ గ్లామర్ ను అంకితం చేసి.. ముదిరిపోయిన తరువాత ఖాళీగా ఉన్నప్పుడు అప్పుడు పిల్లలు గురించి ఆలోచిస్తారు. అయినా పిల్లలు కనలా వద్దా అనేది కూడా బయట జనమే డిసైడ్ చేస్తే ఎలా !

Related Posts

తప్పదిక.. పెద్ద సినిమాలు తాడో పేడో తేల్చుకోవాల్సిందే.!

'లవ్ స్టోరీ' సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చింది. మంచి టాక్ సంపాదించుకుంది. కష్టకాలంలో తెలుగు సినిమాకి ఊరటనిచ్చింది 'లవ్ స్టోరీ' రిలీజ్. వాస్తవానికి 'సీటీమార్' ద్వారా ఈ వేవ్ రావల్సి ఉంది. 'సిటీమార్' తరహాలో...

నాగచైతన్య ‘లవ్ స్టోరీ’ ఊపు తెచ్చిందిగానీ.!

అహహా.. ఎన్నాళ్ళ తర్వాత ఈ సందడి.? అడ్వాన్స్ బుకింగుల జోరు చూసి ఎన్నాళ్ళయ్యింది.? సినీ పరిశ్రమలో జరుగుతున్న చర్చ ఇది. ఔను, శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య, సాయిపల్లవి జంటగా రూపొందిన 'లవ్...

మేమే గెలుస్తాం: మంచు విష్ణు ధీమా అదిరింది..

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ 'మా' ఎన్నికల్లో ఇంతకు ముందెప్పుడూ లేనంత గందరగోళం ఈసారి నెలకొన్న మాట వాస్తవం. దానికి కారణమెవరు.? అన్నదానిపై భిన్న వాదనలున్నాయి. ప్రకాష్ రాజ్ ద్వారా హంగామా మొదలైంది.. అక్కడినుంచే...

Related Posts

Latest News