Anushka: పవన్ కళ్యాణ్ ఎస్ అంటేనే ఆ పని చేస్తా.. క్లారిటీ ఇచ్చిన అనుష్క!

Anushka: అనుష్క శెట్టి ప్రస్తుతం ఘాటీ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో ఎంతో బిజీగా ఉన్నారు. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సెప్టెంబర్ 5వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేస్తున్నారు. అయితే అనుష్క ప్రమోషన్లలో భాగంగా కెమెరా ముందుకు రాకపోయినా రేడియో ద్వారా ఆమె ఈ సినిమాకు సంబంధించి ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా రేడియో మిర్చిలో పాల్గొన్న అనుష్కకు జాకి నుంచి ఒక ఆశక్తికరమైన ప్రశ్న ఎదురయింది.

ఈ సందర్భంగా ఆమె ప్రశ్నిస్తూ నాకు ఇండస్ట్రీలో ఇద్దరంటే చాలా ఇష్టం. ఒకటి మీరు మరొకటి పవన్ కళ్యాణ్ గారు అయితే మీ ఇద్దరి కాంబినేషన్లు ఇప్పటివరకు ఒక సినిమా కూడా రాలేదు భవిష్యత్తులో వస్తుందా అనే ప్రశ్న ఎదురయింది. ఈ ప్రశ్నకు అనుష్క సమాధానం చెబుతూ పవన్ కళ్యాణ్ గారితో సినిమా చేయాలని నేను కూడా చాలా రోజుల నుంచి ఎదురుచూస్తున్నాను కానీ తనకు అలాంటి అవకాశం రాలేదని ఆయన సినిమాలో ఛాన్స్ వస్తే చాలు పాత్ర ఎలాంటిదైనా తాను నిర్మొహమాటంగా నటిస్తాను అంటూ అనుష్క చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. మరి అనుష్కకు పవన్ కళ్యాణ్ సినిమాలో ఇప్పుడైనా ఛాన్స్ ఇస్తారా లేదా అనేది తెలియాల్సి ఉంది.

ఇకపోతే అనుష్క టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్నటువంటి స్టార్ హీరోలు అందరూ సినిమాలలో నటించారు కానీ రామ్ చరణ్ పవన్ కళ్యాణ్ లతో మాత్రం ఇప్పటివరకు సినిమాలలో నటించలేదు. ఇక ఈమె వచ్చిన ప్రతి అవకాశాన్ని ఏమాత్రం సద్వినియోగం చేసుకోలేదు.. తనకు కథ నచ్చి తన పాత్రకు ప్రాధాన్యత ఉంటేనే సినిమాలలో నటిస్తున్నారు. ఇక ఇటీవల కాలంలో అనుష్క లేడీ ఓరియంటెడ్ సినిమాలలో కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఘాటీ సినిమా కూడా లేడీ ఓరియంటెడ్ సినిమాగా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది.