Anushka: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అనుష్క పేరు వినగానే మనకు ముందుగా గుర్తుకువచ్చే సినిమాలు భాగమతి, అరుంధతి,బాహుబలి. ఈ సినిమాల కంటే ముందు చాలా సినిమాలలో నటించినప్పటికీ ఈ సినిమాలు మాత్రం అనుష్క శెట్టికి భారీగా గుర్తింపు తెచ్చిపెట్టాయి. ప్రధాన పాత్రలతో పాటుగా గ్లామరస్ పాత్రలు కూడా పోషించారు అనుష్క. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతోమంది అభిమానులు ఉన్నారు. అయితే అనుష్కలోని నట విశ్వరూపాన్ని తెరపై ఆవిష్కరించిన తొలి సినిమా మాత్రం మాత్రం అరుంధతి అని చెప్పాలి. ఆ తరువాత అనుష్క పయనమే మారిపోయింది.
ఏ చిత్రంలోనైనా ఒక హీరోయిన్ పాత్రను చూస్తే ఆ పాత్రలో అనుష్క అయితే ఇంకా బాగా నటించేవారు అని అనుకునే ఉన్నత శిఖరాలకు చేరుకున్నారు అనుష్క. ఒక పాత్ర కోసమే బరువు పెంచుకున్న నటి ఎవరైనా ఉన్నారంటే అది అనుష్కనే అవుతారు. అలాంటి అద్భుత నటి వయసు ఇప్పుడు 43 ఏళ్లు. ఇంత వయసు వచ్చినా కూడా ఇప్పటికీ పెళ్లి చేసుకోకుండా అలాగే ఉన్నారు అనుష్క. మామూలుగా సినిమా ఇండస్ట్రీలోని సెలబ్రిటీలకు కూడా బాల్యంలో లవ్ స్టోరీస్ ఉంటాయి. అలా అనుష్కకు కూడా చిన్నప్పుడు ఒక లవ్ స్టోరీ ఉందట. తాజాగా ఇదే విషయాన్ని చెప్పుకొచ్చింది. ఈ సందర్భంగా అనుష్క మాట్లాడుతూ..
నేను ఆరవ తరగతి చదువుతున్నప్పుడు అదే తరగతి చదువుతున్న సహ విద్యార్థి నా వద్దకు వచ్చి ఐ లవ్ యూ అని చెప్పాడు. ఆ వయసులో ఐ లవ్ యూ అంటే ఏమిటో కూడా తెలియదు. అయినా అతనికి ఓకే అని చెప్పాను. ఆ విషయం గుర్తుకు వస్తే ఇప్పటికీ మధురమైన అనుభూతిని కలిగిస్తుంది అని అన్నారు. అనుష్క ప్రస్తుత సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఈమె ఘాటీ సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. అదే విధంగా అనుష్క తొలిసారిగా మలయాళంలో నటిస్తున్న చిత్రం షూటింగ్ దశలో ఉంది.
