Ghaati: అనుష్క ఘాటీ సినిమా వాయిదా వేసిన మేకర్స్.. అసలు కారణం అదే!

Ghaati: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ స్వీటీ అనుష్క గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగులో ఎన్నో సినిమాలలో నటించి హీరోయిన్గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకుంది అనుష్క శెట్టి. టాలీవుడ్ లో ఉన్న స్టార్ హీరోయిన్స్ లో ఈ ముద్దుగుమ్మ కూడా ఒకరు. అరుంధతి,భాగమతి వంటి పవర్ఫుల్ క్యారెక్టర్లలో కూడా నటించి ప్రేక్షకులకు బాగా చేరువ అయింది. అనుష్క కెరియర్ లో అరుంధతి సినిమా ఒక మైలురాయి అని చెప్పాలి. బాహుబలి సినిమా వరకు వరుసగా సినిమాలలో నటించి ముప్పించిన అనుష్క ఆ తర్వాత సినిమాలలో నటించడమే మానేసింది.

బాహుబలి సినిమా తరువాత అతి కష్టం మీద ఒకటి రెండు సినిమాలలో నటించింది. అనుష్క కావాలనే సినిమాలకు బ్రేక్ ఇచ్చిందా లేక తనకు అవకాశాలు రాలేదా అన్నది ప్రేక్షకులకు అభిమానులకు అర్థం కావడం లేదు. ఇక ఆ సంగతి పక్కన పెడితే అనుష్క నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఘాటీ. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో అనుష్క ప్రధాన పాత్రలో ఈ సినిమా తెరకెక్కుతోంది. యు వి క్రియేషన్స్ సమర్పణలో రాజీవ్ రెడ్డి సాయిబాబా జాగర్లమూడి నిర్మిస్తున్నారు. కాగా ఈ సినిమాను ఈనెల 11వ తేదీన విడుదల చేయాలని మొదట మూవీ మేకర్స్ అనుకున్నారు.

కానీ తాజాగా సినిమా విడుదల తేదీని వాయిదా వేస్తున్నట్లు చెబుతూ ఒక లేఖన విడుదల చేసారు మూవీ మేకర్స్.
సినిమా అనేది జీవనది లాంటిది. కొన్నిసార్లు అది వేగంగా ముందుకు వెళుతుంది. కొన్నిసార్లు లోతు పెంచుకోవడానికి ఆగుతుంది. ‘ఘాటీ’ అనేది కేవలం సినిమా మాత్రమే కాదు… అది పర్వతాల ప్రతిధ్వని, అడవిలోని చల్లటి గాలి. మట్టి నుంచి, రాతి నుంచి చెక్కిన కథ. ప్రతి ఫ్రేమ్‌ని అద్భుతంగా ఆవిష్కరించడం కోసం మేం మరికొంత సమయం వెచ్చించాలనుకున్నాం అని ఘాటీ చిత్రబృందం ఒక లేఖను విడుదల చేసింది. అయితే విజువల్‌ ఎఫెక్ట్స్‌కి ప్రాధాన్యం ఉన్న చిత్రం కావడంతో, ఆ పనులు పూర్తి కాకపోవడం వల్లే రిలీజ్‌ ను వాయిదా వేశారట. మరి ఈ పనులు ఎప్పుడు పూర్తి అవుతాయో సినిమా ఎప్పుడు విడుదల అవుతుందో చూడాలి మరి.