గాసిప్స్ : “గాడ్ ఫాదర్” ప్రీ రిలీజ్ కి రెండు భారీ ప్రీ రిలీజ్ లు.?

దిగ్గజ హీరో మెగాస్టార్ చిరంజీవి హీరోగా బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కూడా కీలక పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ భారీ మల్టీ స్టారర్ చిత్రం “గాడ్ ఫాథర్” కోసం అందరికీ తెలిసిందే.ప్రముఖ దర్శకుడు మోహన్ రాజా తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై రీసెంట్ గా వచ్చిన టీజర్ తో సాలిడ్ హైప్ స్టార్ట్ అయ్యింది.

ఇక ఇదిలా ఉండగా ఈ అవైటెడ్ సినిమాపై మేకర్స్ ఈరోజు నయనతార ఫస్ట్ లుక్ పోస్టర్ తో రిలీజ్ డేట్ పై బిగ్ క్లారిటీ కూడా ఇచ్చారు. దీనితో పాటుగా ఈ రెండు రోజులు నుంచి ఈ సినిమాపై ప్రీ రిలీజ్ కి సంబంధించి క్రేజీ బజ్ కూడా బయటకి వచ్చింది.

అయితే ఇపుడు లేటెస్ట్ గా వచ్చిన మరో టాక్ ప్రకారం అయితే మేకర్స్ రెండు ప్రీ రిలీస్ ఈవెంట్స్ ని ప్లాన్ చేస్తున్నారట. మరి ఒకటి తెలుగులో అందులోని ఏపీ లో ప్లాన్ చేస్తుండగా మరొకటి హిందీ వెర్షన్ కి గాను ప్లాన్ చేస్తున్నారట.

దీనితో అయితే ఈ సినిమాపై రెండు ప్రీ రిలీజ్ ఈవెంట్స్ కన్ఫర్మ్ అయ్యాయని తెలుస్తుంది. మరి వీటిపై మరింత సమాచారం రావాల్సి ఉంది. ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గెస్ట్ గా వస్తాడని అంటున్నారు మరి చూడాల్సిందే ఏమవుతుందో.