కాస్టింగ్ కౌచ్ పై యాంకర్ రష్మీ హాట్ కామెంట్స్

ఏ విషయమైనా మొహమాటం లేకుండా బోల్డ్ గా మాట్లాడేస్తుంది యాంకర్ రష్మీ. కాస్టింగ్ కౌచ్ గురించి కూడా కుండ బద్దలు కొట్టినట్టు సమాధానం చెప్పింది. ప్రస్తుతం ఆమె నటించిన “అంతకు మించి” సినిమా ప్రమోషన్లలో బిజీగా ఉంది రష్మీ. అందుకోసం పలు ఇంటర్వూస్ లో పాల్గొంటోంది. ఈ నేపథ్యంలో ఒక ఇంటర్వ్యూలో కాస్టింగ్ కౌచ్ అంశంపై స్పందించింది రష్మీ.

ఒక ఇంటర్వ్యూలో కాస్టింగ్ కౌచ్ గురించి రష్మీని ప్రశ్నించగా ఆమె బోల్డ్ గా సమాధానం చెప్పింది. అమ్మాయిలు, అబ్బాయిలు కలిసి పనిచేసే ప్రతి ఇండస్ట్రీలోనూ ఇది జరుగుతుంది. ఎక్స్‌ప్లాయిట్‌ చేయటానికి మగవాళ్ళు ట్రై చేస్తుంటారు, కానీ యాక్సెప్ట్ చెయ్యాలా లేదా అనేది అమ్మాయి చాయిస్. ఒకసారి నో చెప్పాక ఎవరూ బలవంత పెట్టరు, రేప్ చెయ్యరు. అప్పటికీ బలవంతం పెడితే అది నేరమే అవుతుంది.

కొంతమంది అమ్మాయిలు కాస్టింగ్ కౌచ్ కి లొంగిపోకుండా కష్టపడి పైకి రావాలి అనుకుంటారు. కానీ అడ్డదారులు తొక్కి పైకి రావాలి అనుకునే అమ్మాయిల వలన మిగిలిన వారిని కూడా అలానే ట్రీట్ చేస్తున్నారు. ఎవరో ఒకరు చేసిన తప్పుకి ఇండస్ట్రీ మొత్తాన్ని నిందించటం కరెక్ట్ కాదు అని రష్మీ వెల్లడించింది.

ఇక సుధీర్ అమ్మాయిల వెంటపడుతుంటాడు అంటూ తరచూ వినపడే రూమర్స్ పై హాట్ కామెంట్స్ చేసింది రష్మీ. సుధీర్ వయసులో ఉన్న కుర్రాడు. అమ్మాయిల వెంట పడితే తప్పేంటి? అందులో నాకేమి తప్పు కనిపించలేదు. సుధీర్ అమ్మాయిల వెంట పడుతున్నాడంటే అదేదో పాపం అయినట్టు బూతద్దంలో చూడకండి అంటూ సెలవిచ్చింది.

అంతేకాదు తనకి, సుధీర్ కి మధ్య రిలేషన్ గురించి కూడా ఈ ఇంటర్వ్యూలో మరోసారి క్లారిటీ ఇచ్చింది. జబర్దస్త్ లో నేను, సుధీర్…ఒకరిపై మరొకరం కామెంట్స్ చేసుకుంటాం. కానీ అదంతా వినోదం కోసమే. మా ఇద్దరికీ పర్సనల్ గా ఎలాంటి సంబంధం లేదంటూ వెల్లడించింది రష్మీ.