అల్లు శిరీష్ ఒక ఇంటివాడు అవబోతున్నాడు.

అల్లు శిరీష్ ఒకింటివాడవబోతున్నాడు. ఒకింటివాడు అవబోతున్నాడు అంటే పెళ్లి చేసుకోబోతున్నాడు అనుకోకండి. తాను నటించబోతున్న కొత్త సినిమా కోసం ఒక ఇల్లు తీసుకున్నాడు శిరీష్. “ఏబీసీడీ( అమెరికన్ బార్న్ కన్ఫ్యూజ్డ్) సినిమాను మలయాళంలో రీమేక్ చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ లో భాగంగా అల్లు శిరీష్ నివసించడానికి హైద్రాబాదులో ఒక ఇంటిని సెలెక్ట్ చేశారు.

ఈ విషయాన్నీ ట్విట్టర్ ద్వారా వెల్లడించాడు అల్లు శిరీష్. మరో రెండు నెలలు నా ఇల్లు ఇదేనంటూ ఆ ఇంటికి సంబంధించిన వీడియోను అభిమానులతో పంచుకున్నాడు. ఈ సినిమాలో అల్లు శిరీష్, రుక్సార్ థిల్లాన్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాను మధుర శ్రీధర్, యష్ రంగినేని కలిసి నిర్మిస్తున్నారు. సంజీవ్ అనే యువ దర్శకుడు ఈ సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయమవనున్నాడు. కింద ఉన్న లింక్ పై క్లిక్ చేసి ఆ వీడియో చూడవచ్చు.