Vaishnav Tej: మెగా కుటుంబ పరువు తీస్తున్న వైష్ణవ్ తేజ్…ఇలాంటి పనులు చేయడం ఏంటీ?

Vaishnav Tej: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మెగా కుటుంబానికి ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి. సినిమా ఇండస్ట్రీలోకి ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా అడుగుపెట్టి ఇండస్ట్రీలో మంచి సక్సెస్ అందుకున్నారు మెగాస్టార్ చిరంజీవి. ఇలా చిరంజీవి హీరోగా గుర్తింపు పొందడంతో ఈయన వారసులుగా ఇప్పటికే తన కొడుకులు అల్లుళ్ళు కూడా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. ఇక మెగా హీరోలు అంటే ఇండస్ట్రీలో వారికంటూ ఒక సపరేట్ రెస్పెక్ట్ కూడా ఉంటుందని చెప్పాలి. ఇదంతా కూడా చిరంజీవి వల్లే అని చెప్పడంలో ఆశ్చర్యం లేదు.

చిరంజీవి మేనల్లుడుగా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు నటుడు వైష్ణవ్ తేజ్. ఉప్పెన సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో మంచి సక్సెస్ అందుకున్న ఈయన ఆ తర్వాత ఆది కేశవ వంటి సినిమాలలో నటించారు కానీ పెద్దగా ఈ సినిమా కూడా సక్సెస్ అందుకోలేకపోయింది. ప్రస్తుతం కెరియర్ పరంగా ఇబ్బందుల్లో ఉన్న వైష్ణవ్ కోసం ఒక చిన్న దర్శకుడు అద్భుతమైన కథను తీసుకువచ్చి ఆయనకు అడ్వాన్స్ కూడా ఇచ్చారట అయితే ఈ సినిమాకు కమిట్ అయిన కొద్ది రోజులకే వైష్ణవ్ కు మరో పెద్ద సినిమాలో అవకాశం వచ్చిందని తెలుస్తోంది.

ఇలా పెద్ద సినిమాలో అవకాశం రావడంతో ఈయన చిన్న దర్శకుడికి హ్యాండ్ ఇచ్చారని తెలుస్తుంది అయితే ఆదర్శకుడికి పెద్దగా సపోర్ట్ లేని నేపథ్యంలో ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని సమాచారం ఇక ఈ విషయం సోషల్ మీడియాలోనూ ఇటు ఇండస్ట్రీలోనూ సంచలనంగా మారడంతో వైష్ణవ్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేయడమే కాకుండా మెగా పరువు మొత్తం తీస్తున్నాడు అంటూ మెగా అభిమానులు కూడా విమర్శలు కురిపిస్తున్నారు. మరి వైష్ణవ్ గురించి వస్తున్న ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉంది అనేది తెలియాల్సి ఉంది.