శివగామి కార్ లో అంత మద్యం ఎక్కడికి?
చెన్నైలో నివసిస్తున్న వెటరన్ నటి రమ్య కృష్ణ అనూహ్యంగా వార్తల్లో వ్యక్తి అయ్యారు. శివగామి కార్‌లో భారీ ఎత్తున మద్యం కనుగొన్న చెన్నై పోలీసులు ప్రస్తుతం దర్యాప్తు సాగిస్తున్నారు. చెన్నై ఇసిఆర్ రహదారిపై క్రమం తప్పకుండా శోధిస్తున్న సమయంలో పోలీసులకు ఊహించని షాక్ నిచ్చారు సదరు సీనియర్ నటి.
పోలీసుల శోధనలో ఆ కారులో భారీ మొత్తంలో మద్యం లభించింది. కారులో 96 బీర్ బాటిల్స్ .. 8 మద్యం బాటిళ్లను కనుగొన్నారు. కారు డ్రైవర్ సెల్వకుమార్ ను వెంటనే అదుపులోకి తీసుకున్నారు. రమ్య కృష్ణన్ కి పోలీసు స్టేషన్ నుండి బెయిల్ ఇచ్చినట్లు సమాచారం. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
తాజా వార్తల నేపథ్యంలో రమ్య కృష్ణకు అంత పెద్ద మొత్తంలో మద్యం ఎందుకు అవసరం పడింది? అంటూ ప్రజలు ఆరా తీస్తున్నారు. సినీ కళాకారుల మద్య సేవనం సాధారణమే కానీ ప్రభుత్వం దుకాణాలను పూర్తిగా తెరిచి ఉంచినా.. ఇంత ఎక్కువ మొత్తంలో మందుబాటిళ్లు తీసుకోవడం చాలా సందేహాలకు కారణమైంది.
రమ్య కృష్ణ ప్రస్తుతం తన భర్త కృష్ణ వంశీ దర్శకత్వం వహిస్తున్న `రంగ మార్తాండ` చిత్రంలో నటిస్తున్నారు. పూరి జగన్నాధ్ నిర్మించిన `రొమాంటిక్` మూవీలోనూ కీలక పాత్రను పోషిస్తున్నారు. కొన్ని తమిళ ప్రాజెక్టులలోనూ నటిస్తున్నారు.