సెప్టెంబర్ లో ‘తెనాలి రామకృష్ణ’ గా సందీప్ కిషన్

హీరో సందీప్ కిషన్ కి ఈ మధ్య సరైన హిట్ లేక వెనుక పడిపోయాడు. అతని సినిమా విడుదల అయ్యి కూడా చాలా కాలం అయింది. అయినా సరే నేనున్నాను అంటూ మళ్ళీ మన ముందుకు వస్తున్నాడు. తన కొత్త చిత్రం ‘తెనాలి రామ కృష్ణ’ అసలు ఆగష్టు లో విడుదల కావాల్సి ఉంది, కానీ అతనికి తాజాగా షూటింగ్ లో గాయపడటం వల్ల విడుదల వాయిదా పడింది. హాస్య చిత్రాల దర్శకుడు జి. నాగేశ్వర్ రెడ్డి ఈ చిత్రానికి దర్శకుడు. పూర్తి వినోద ప్రాధానంగా ఈ చిత్రం సాగుతుందని దర్శక నిర్మాతలు చెబుతున్నారు. ఆ పైన ‘నిను వీడని నీడను నేనే’ అనే సినిమా సందీప్ చేతిలో ఉంది.