`డొనేట్ ప్లాస్మా సేవ్ లైవ్స్` ఉద్యమం
కొద్దిరోజుల క్రితం పాపులర్ హీరో శ్రీ విష్ణు సోషల్ మీడియాలో కొవిడ్ 19 చికిత్సపై అవగాహన ఉద్యమాన్ని స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే. 68 ఏళ్ల కోవిడ్ -19 పాజిటివ్ ఓల్డ్ మాన్ ప్రాణాలను కాపాడటానికి ముందుకు వచ్చి బ్లడ్ ప్లాస్మాను దానం చేయాలని కోరారు. తాజాగా మరోసారి ప్లాస్మా డొనేట్ చేసి ప్రాణాల్ని కాపాడాల్సిందిగా పిలుపునిచ్చాడు. పదిమంది హీరోలకు ఆదర్శంగా నిలిచాడు.
శ్రీ విష్ణు నిన్న రాత్రి ట్విట్టర్ లో ఈ తరహా కొత్త ప్రచారం ప్రారంభించారు. ఇప్పటికే చికిత్స పొంది కోలుకున్న వారి ప్లాస్మాను దానం చేయమని ప్రోత్సహించడానికి ప్రజలలో అవగాహన పెంచడమే ఈ ప్రచారం ఉద్ధేశం.
శ్రీ విష్ణు తన మిత్రులకు ఇదే విషయంపై ఛాలెంజ్ విసిరారు. తన క్లోజ్ ఫ్రెండ్ నారా రోహిత్ .. అలాగే `బ్రోచేవారెవరురా` సహనటి నివేదా థామస్ లకు సవాలు విసిరారు. వీళ్లంతా మరో ఇద్దరు ముగ్గురికి ఇలానే సవాల్ విసిరి ప్లాస్మా డొనేషన్ పై ప్రచారం చేయాల్సి ఉంటుంది. శ్రీవిష్ణు ప్రచారం ప్రశంసించదగినది. అందరు హీరోలకు ఆదర్శమైనది.. స్ఫూర్తిగా తీసుకుని ప్రచారం చేయడమే మిగిలింది.
#NewProfilePic As an initiative I’m changing my DP to #DonatePlasma. I’m nominating @IamRohithNara & @i_nivethathomas to take this further and create awareness to save lives in this #Covid pandemic situation.#StayStrong #StaySafe pic.twitter.com/BAXQ3wit0m
— Sree Vishnu (@sreevishnuoffl) July 10, 2020