Meenakshi Chowdary: ఆ హీరోతో నటించి పెద్ద తప్పు చేశాను…. తెగ ఫీల్ అవుతున్న మీనాక్షి చౌదరి?

Meenakshi Chowdary: టాలీవుడ్ ఇండస్ట్రీలో క్రేజీ హీరోయిన్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో నటి మీనాక్షి చౌదరి ఒకరు. ఇచ్చట వాహనములు నిలపరాదు సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈమె కెరియర్ మొదట్లో అనుకున్న స్థాయిలో సక్సెస్ అందుకోలేకపోయారు. ఈ సినిమాల తర్వాత హిట్ 2 సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి క్రేజ్ సొంతం చేసుకున్న మీనాక్షి చౌదరి ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు.

ఇటీవల వరుసగా ఈమె లక్కీ భాస్కర్, సంక్రాంతికి వస్తున్నాం వంటి బ్యాక్ టు బ్యాక్ హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుని టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్నారు. ఇకపోతే తాజాగా ఈమె ఓ సినిమాలో నటించి సరిదిద్దుకోలేని తప్పు చేశానని తెలియజేశారు. మీనాక్షి చౌదరి ఏ సినిమా విషయంలో అలా ఫీల్ అవుతున్నారనే విషయానికి వస్తే….

మీనాక్షి చౌదరి తమిళ స్టార్ హీరో విజయ్ తో కలిసి గోట్ సినిమాలో నటించిన విషయం తెలిసిందే. ఈ సినిమా పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయిన విజయ్ కి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ ఆధారంగా ఈ సినిమా 400 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టింది.. అయితే ఈ సినిమాలో హీరోయిన్ పాత్రలో నటించిన మీనాక్షి చౌదరికి పెద్దగా ప్రాధాన్యత మాత్రం లేదని చెప్పాలి.. ఇలా ప్రాధాన్యత లేని సినిమాలో నటించి తాను తప్పు చేశానని ఈమె తెలియజేశారు. అయితే ఈ సినిమాతో పాటు మీనాక్షి చౌదరి మహేష్ బాబు తో కలిసి నటించిన గుంటూరు కారం సినిమాలో కూడా తన పాత్రకు పెద్దగా ప్రాధాన్యత లేదు. ఈ సినిమాలో ఫస్ట్ హీరోయిన్ గా శ్రీ లీల నటించారు. సెకండ్ హీరోయిన్ గా మీనాక్షిని తీసుకున్నప్పటికీ ఈమెను మహేష్ బాబుకు సేవ చేయడం కోసమే తీసుకున్నారా అనే విధంగా ఈమె పాత్ర ఉంటుందని చెప్పాలి. అయితే ప్రస్తుతం మాత్రం మీనాక్షి చౌదరి ఎంతో ప్రాధాన్యత ఉన్న పాత్రలలో నటిస్తూ బిజీగా ఉన్నారు.