Actor: మామూలుగా సినిమా ఇండస్ట్రీలో పాత్రలు డిమాండ్ చేసినప్పుడు నటీనటులు నటించక తప్పదు. అలా కొన్ని కొన్ని సార్లు స్టార్ హీరోలు విలన్ పాత్రలలో కూడా నటిస్తుండడం మనం చూస్తూ ఉంటాం. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో చాలామంది స్టార్ హీరోలు విలన్ పాత్రలు చేయడానికి ఆసక్తిని చూపిస్తున్న విషయం తెలిసిందే. పాత్రలో బలం ఉండడంతో విలన్ పాత్రలు చేయడానికి కూడా హీరోలు వెనకాడడం లేదు. అలా ఒకప్పుడు స్టార్ హీరోలుగా నటించిన చాలామంది ప్రస్తుతం విలన్ క్యారెక్టర్లలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఉదాహరణకు హీరో జగపతిబాబు అలాగే శ్రీకాంత్ లను చెప్పుకోవచ్చు.
అయితే ఇప్పుడు మరొక స్టార్ హీరో కూడా విలన్ అవతారం ఎత్తాడు. పైన విలన్ అవతారంలో మాస్ క్యారెక్టర్ లో ఉన్న హీరోని గుర్తుపట్టారా. అయినా ఒక స్టార్ హీరో. అంతే కాదండోయ్ ఎంతోమంది అమ్మాయిల డ్రీమ్ బాయ్ కూడా, ఇంతకీ ఆ హీరో ఎవరు? ఏ సినిమాతో విలన్ గా రాబోతున్నాడు అన్న వివరాల్లోకి వెళితే.. కాగా పైన ఫోటోలో ఉన్న నటుడు మరెవరో కాదు మలయాళ స్టార్ హీరో నివిన్ పౌలీ. ఈ స్టార్ హీరో ప్రేమమ్ సినిమాతో మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. సాయి పల్లవి హీరోగా నటించిన ప్రేమమ్ సినిమాలో తన నటనతో ప్రేక్షకులను మెప్పించాడు నివిన్ పౌలీ.
మలయాళంలో ఎన్నో సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకున్న నివిన్ పౌలీ ఇప్పుడు విలన్ గా మారాడు. రాఘవ లారెన్స్ హీరోగా నటిస్తున్న బెంజ్ సినిమాలో విలన్ గా చేస్తున్నాడు నివిన్ పౌలీ. అయితే తాజాగా నివిన్ పౌలీ లుక్ ను రిలీజ్ చేశారు మూవీ మేకర్స్. ఈ సినిమాలో వాల్టర్ అనే పాత్రలో నివిన్ పౌలీ కనిపించనున్నాడు. రాఘవా లారెన్స్ నటిస్తున్న ఈ సినిమాకు స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా కూడా లోకేష్ యూనివర్స్ లో భాగంగా రానుంది. లోకేష్ డైరెక్షన్ కావడంతో ఈ సినిమా పై మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఈగర్ గా ఎదురు చూస్తున్నారు. అలాగే ఈ సినిమా అప్డేట్స్ కోసం ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ కు తాజాగా సినిమాలోని విలన్ ను పరిచయం చేస్తూ పోస్టర్ ను విడుదల చేశారు. వాల్టర్ గా నివిన్ పౌలీ లుక్ చాలా పవర్ఫుల్ గా ఉంది. ఈ సినిమాను లోకేష్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిస్తున్నాడు.